సాధారణంగా సంసారం అన్న తర్వాత భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు కోపాలు పెంచుకున్నప్పటికీ కొద్దిరోజులకు ఆ కోపం కాస్తా తగ్గిపోయి భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కానీ మరి కొందరు అదే కారణం చూపెడుతూ చీటికీ మాటికీ గొడవపడుతూ బంధం నుంచి విడిపోవడం లేదా ఆత్మహత్యలకు పాల్పడటం లేదంటే హత్యలు చేయడం కూడా చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపతిపురంకు చెందిన అప్పారావుకు, అదే మండలానికి చెందిన దేవితో 12 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. ఈ దంపతులకు పదేళ్ల కుమార్తె, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి భార్యాభర్తల మధ్య పరస్పరం గొడవలు తలెత్తడంతో ఒకే ఇంట్లోనే ఉంటున్నప్పటికీ వీరిద్దరు వేర్వేరు గదుల్లో ఉండేవారు. ఇలా వేరువేరుగా ఉంటున్న భార్య భర్తల మధ్య గొడవలు తారా స్థాయికి చేరడం వల్ల వీరి గొడవ సమీప పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది.
ఈ క్రమంలోనే పోలీసులు వీరిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయితే ఈ విషయం బయట తెలియడంతో అప్పారావును ఉద్యోగం నుంచి తొలగించగా అతను ఇంట్లోనే ఉంటున్నాడు. కేవలం తన భార్య కారణంగానే తనకు ఉద్యోగం పోయిందని వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ విధంగా ఒకరోజు వీరిద్దరి మధ్య గొడవ చోటుచేసుకోవడంతో ఆ రోజు రాత్రి దేవి తన భర్తను గొడ్డలితో నరికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని తన భార్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తల్లి ఇంటిని వదిలి వెళ్ళిపోగా తండ్రి మరణించడంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారిపోయారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…