సాధారణంగా ప్రకృతిలో ప్రతి ఒక్క జీవికి ఎన్నో విభిన్నమైన లక్షణాలు ఉంటాయి. కొన్ని జంతువులకు వేటాడే గుణాన్ని దేవుడు వరంగా ప్రసాదిస్తే మరి కొన్ని జంతువులకు ఆ క్రూరమృగాల నుంచి తమను తాము సంరక్షించుకునే లక్షణాలను వరంగా ప్రసాదించాడు. ఈ క్రమంలోనే ఎలాంటి క్రూరమృగాల నుంచి అయినా తమను తాము రక్షించుకొని కొన్ని జంతువులు క్రూర జంతువులకు ఓటమిని చూపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది జంతు ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో భాగంగా చిరుత, ఒక ముళ్లపంది మధ్య భయంకరమైన పోరాటం కొనసాగింది. ఈ క్రమంలోనే చిరుత ఎలాగైనా ఆ ముళ్లపందిని చేరుకోవాలని ప్రయత్నిస్తున్న క్రమంలో ముళ్లపంది తన పదునైన ముళ్ళతో ఆ క్రూర మృగాన్ని తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ముళ్ళ పంది తన పదునైన ముళ్ళు చిరుత పంజాకి గుచ్చడం వల్ల తీవ్ర రక్తస్రావం అయ్యింది.
ఇలా ఈ రెండింటి మధ్య సుమారు 90 నిమిషాల పాటు జరిగిన పోరాటంలో ముళ్ళ పంది చేతిలో చిరుత ఓటమిని చవి చూడక తప్పలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ ముళ్ళ పంది తన పదునైన ముళ్ళ ద్వారా ఎలాంటి జంతువు నుంచైనా తనని తాను రక్షించుకోగలదు అంటూ కామెంట్ చేయగా మరికొందరు చిరుత సరైన ఎరను ఎంచుకోలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…