మద్యం అనేది ఎంతటి పని అయినా చేయిస్తుంది. మద్యం మత్తులో ఉన్నవారు ఒక్కోసారి ఒళ్లు జలదరించే పనులు చేస్తుంటారు. తీరా తెలివి వచ్చాక వారు చేసిన పని తలచుకుని వారికే భయం కలుగుతుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి అక్కడ చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
చత్తీస్‌గడ్‌లోని కోర్బాలో ఉన్న ఇందిరానగర్ అనే ప్రాంతంలో రాజు జంగ్డె, హితేంద్ర ఆనంద్ అనే ఇద్దరు యువకులు నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి వారు పీకలదాకా మద్యం సేవించి గ్రామంలో చోట డ్రెయినేజీ దగ్గర ఆగారు. అక్కడ మంటల్లో సగం వరకు కాలిపోయిన పామును వారు చూశారు. అయితే అది ఇంకా బ్రతికే ఉంది.
ఈ క్రమంలో వారు ఆ పామును తీసుకుని కరకరా నమిలి తినడం మొదలు పెట్టారు. ఇద్దరూ తల భాగాన్ని కొరికి తిన్నాక మిగిలిన భాగాన్ని నమిలి మింగారు. వెంటనే ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఇంటికి వెళ్లగానే ఇద్దరూ కళ్లు తిరిగి, వాంతులు చేసుకుంటూ పడిపోయారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.
హాస్పిటల్‌లో వైద్యులు చికిత్స చేసి వారిని రక్షించారు. కొంత ఆలస్యం అయి ఉంటే వారి ప్రాణాలు పోయి ఉండేవని, ప్రస్తుతం ఆ ఇద్దరు యువకులు క్షేమంగానే ఉన్నారని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
అయితే పామును ఎందుకు కొరికి తిన్నారని ప్రశ్నించగా.. తమ గ్రామంలో పాములు బాగా తిరుగుతున్నాయని, అందుకే కోపం వచ్చి కొరికేశామని, లేకపోతే అది ఎవరినైనా కాటు వేస్తుందని భావించామని, అందుకనే ఆ పనిచేశామని చెప్పారు. దీంతో వారి సమాధానం విన్నవారు షాకయ్యారు. అయితే నిజానికి అది అత్యంత విష పూరితమైన పాము అని, అది కాటు వేస్తే 15 నిమిషాల్లోనే చనిపోతారని, అలాంటిది ఆ ఇద్దరూ బతికారంటే వారికి భూమిపై ఇంకా నూకలు ఉన్నందు వల్లేనని వైద్యులు తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…