మీకు రస్క్‌లు తినే అలవాటు ఉందా ? చాయ్‌లో వాటిని ఎక్కువగా ముంచి తింటుంటారా ? అయితే కింద ఇచ్చిన వీడియో చూస్తే మీరు ఇకపై అలా చేయరు. అవును.. ఎందుకంటే.. జరిగిన సంఘటన అలాంటిది మరి.
ఓ బేకరీ తయారీ యూనిట్‌లో కొందరు వర్కర్లు రస్క్‌లను తయారు చేస్తూ వాటిని ప్యాక్ చేస్తున్నారు. అయితే వారిలో ఒక వర్కర్ ఒక ట్రేలో కొన్ని రస్క్‌లను ఉంచి వాటిపై పాదాలను ఉంచాడు. తరువాత కొన్ని రస్క్‌లను తీసి వాటిని నాకుతూ ప్యాక్ చేస్తున్నాడు. చుట్టూ ఉన్నవారు వేడుక చూసినట్లు సంతోషంతో నవ్వుతుండడం మనం వినవచ్చు.
https://www.instagram.com/p/CT4QHsilsGC/?utm_source=ig_embed&ig_rid=67b92b54-b5a2-435f-ac75-9c65de053fc8&ig_mid=EF46F7B1-5D8E-420C-9D41-E4BEEE1AB235
అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఈ వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో ఈ విధంగా చేస్తున్న ఆ వ్యక్తిని విడిచిపెట్టవద్దని, అతను ఎక్కడ ఉన్నా సరే అరెస్టు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇకపై రస్క్‌లను తినబోమని కొందరు కామెంట్లు పెట్టారు.