జంతువుల దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా సరే కాస్తంత అప్రమత్తంగా ఉండాలి. కొన్ని జంతువులు చూసేందుకు సాఫ్ట్‌గా కనిపిస్తాయి. అవి మనకు హాని కలగజేసేవిగా ఉండవు. దీంతో మనం వాటి దగ్గరగా వెళ్తాం. అయితే అవి సడెన్‌గా దాడి చేస్తాయి. అవును.. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఓ యువతికి ఎదురైంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఓ యువతి ఓ మేకతో సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించింది. ఆ సమయంలో ఓ వీడియోను కూడా రికార్డు చేసింది. అయితే ఒక దశలో మేక ఆమె దగ్గరకు వస్తున్నట్లు కనిపించింది. ఆమె పట్ల ఆకర్షితమైన మేక ఆమె వద్దకు వస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. కానీ అలా కాదు. అది వెనక్కి వెళ్లి ఇంకోసారి ఆమె వద్దకు వచ్చీ రాగానే తన కొమ్ములతో ఆమెను పొడిచేసింది.
https://twitter.com/AwardsDarwin_/status/1433053666739728388
ఒక్కసారిగా జరిగిన ఈ హఠాత్ పరిణామానికి ఆమె ఖంగు తిన్నది. ఈ వీడియో మొత్తం 11 సెకన్ల నిడివి ఉండగా మేక ఢీకొట్టాక ఆమెకు ఏమైందీ తెలియలేదు. అయితే ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే దీనికి 4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ఈ వీడియోను ఆసక్తిగా చూస్తున్నారు.