ఈ భూమిపై దయ్యాలు ఉన్నాయా అంటే చాలామంది ఉన్నాయనే చెబుతారు. కానీ కొంతమంది మాత్రం దయ్యాలు అనేది కేవలం మన అపోహ మాత్రమేనని కొట్టి పారేస్తారు. కానీ మనం సోషల్ మీడియాలో పలు దయ్యాల వీడియోలు చూస్తూ ఉంటాం.అయితే అవి సాంకేతికతను ఉపయోగించి తయారు చేస్తారు అనుకుంటే తాజాగా కొన్ని ఇళ్ళ ముందు ఉంచిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను చూస్తే నిజంగానే ఈ భూమిపై దయ్యాలు ఉన్నాయా అన్న సందేహం కలగక మానదు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది.గ్లాస్గో సమీపంలోని బారోఫీల్డ్‌లో నివసిస్తున్న మాక్సిన్ హ్యూస్ అనే మహిళ తన ఇంట్లో సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియోలు చూస్తూ ఒక్కసారిగా షాక్ అయింది. ఈ సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన వీడియోలలో ఒకటి నల్లటినీడ తన ఇంటిలోకి ప్రవేశించడం చూసిన ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనై మతాధికారిని పిలిపించి సమస్యకు పరిష్కారాన్ని సూచించమని కోరింది.
ఈ క్రమంలోనే మాక్సిన్ మాట్లాడుతూ.. ఈ విధంగా ఈ నీడ తమ ఇంటి చుట్టూ కనిపించడం ఇది తొలిసారి కాదని, తన పిల్లలు గార్డెన్లో ఆడుకుంటే వారి చుట్టూ ఇలాంటి నీడ తిరుగుతూ ఉంటుందని తెలిపారు.అయితే ఈ నీడ వల్ల తమ ఇంటి పై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడుతుందేమోనని భావించి మాక్సిన్ మతాధికారిని పిలిపించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇంటిలోకి ప్రవేశించి నటువంటి నీడకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రవేశించి నటువంటి నీడకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://youtu.be/JpuQVSJuAYk