సాధారణంగా ఊసరవెల్లి రంగులు మార్చడం మనం చూస్తుంటాం. ఈ క్రమంలోనే ప్రతి విషయానికి మాట మార్చే వారిని ఊసరవెల్లితో పోలుస్తుంటారు. ఇప్పటివరకు మనం కేవలం ఊసరవెల్లి మాత్రమే రంగులను మార్చుకుంటూ ఉంటుందని విని ఉన్నాం. కానీ ఊసరవెల్లి తరహాలోనే ఆక్టోపస్ కూడా రంగులు మార్చుకుంటుందనే విషయం మీకు తెలుసా ? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆక్టోపస్ కూడా నిద్రలో అచ్చం ఊసరవెల్లి మాదిరిగా రంగులు మార్చుకుంటోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విధంగా ఆక్టోపస్ రంగులు మార్చుకున్న వీడియో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అయితే నిద్రపోయే సమయంలో మాత్రమే ఈ విధంగా రంగులు మార్చుకుంటూ ఉండటం విశేషం. ఇది అన్ని ఆక్టోపస్ లు మాదిరిగా కాకుండా, ఎంతో తెలివైనది. సొంతంగా గూడును కట్టుకోగలదు. అదే విధంగా ఆల్చిప్పలలో, కొబ్బరి చిప్పలలో కూడా ఇవి దాక్కోగలవు.
https://twitter.com/buitengebieden_/status/1429074307251060740
ఏవైనా చేపలు వీటిని తినడానికి వస్తే ఆక్టోపస్ ఒక బ్లూ కలర్ విషాన్ని నీటిలోకి చిమ్ముతుంది. ఇలా చేయటం వల్ల ఆ నీరు మొత్తం నీలి రంగులోకి మారిపోవడంతో ఆక్టోపస్ అక్కడి నుంచి తప్పించుకుపోతుంది. ఈ విధంగా చేపల నుంచి తమను తాము రక్షించుకోగలవు. ఈ విధంగా రంగులు మారే ఆక్టోపస్ కి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో బ్యూటెంజెబీడెన్ షేర్ చేయడంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతో మంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.