కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లల సంక్షేమం కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తీసుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా మంది తల్లిదండ్రులు ఈ పథకం ద్వారా ప్రతి నెల వారి ఆడ పిల్లల పేరిట డబ్బులు జమ చేస్తున్నారు. సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు జమ చేయాలంటే తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఈ పథకంలో డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే చాలామంది సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు జమ చేయడానికి పోస్టాఫీసుకు వెళ్లి కేవలం పోస్ట్ మాస్టర్ చేతిలో డబ్బులు పెట్టి రావడంతో ఇదే అదునుగా చేసుకొని కొంతమంది పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు జమ చేసేవారు పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి డబ్బులు డిపాజిట్ చేసిన వెంటనే పాస్ బుక్ లో ఎంటర్ చేయించుకొని పాస్ బుక్ ప్రింట్ తీసుకోవాలి.
ఈ విధంగా పాస్ బుక్ ప్రింట్ తీసుకున్నప్పుడే ఖాతాలో డబ్బులు జమ అయ్యాయని తెలుస్తుంది. మీరు కేవలం డబ్బులు ఇచ్చే వస్తే మాత్రం మీరు మోస పోవాల్సి వస్తుంది. కనుక ఇకపై సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు వేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాస్ బుక్ లో ఎంటర్ చేయించుకొని ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సుకన్య సమృద్ధి యోజన పథకంలో జరిగిన భారీ మోసం ఇటీవలే బయటికి రావడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.