సాధారణంగా కొందరికి మూగజీవాలు అంటే ఎంతో ఇష్టం, ప్రేమ ఉంటాయి. ఈ క్రమంలోనే వాటి కోసం ఎంతో ఖర్చు చేస్తుంటారు. ఆ పెంపుడు జంతువులు కూడా యజమాని పట్ల అంతే ప్రేమ, విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. ఇలా ఎంతో అపురూపంగా చూసుకునే జంతువులకు ఏ చిన్నపాటి గాయమైనా తల్లడిల్లిపోతుంటారు. అలాగే వీటిపై ఉన్న ప్రేమతో కొందరు ఎక్కడికి ప్రయాణించినా వారితోపాటు ఈ పెంపుడు జంతువులను కూడా వెంట తీసుకెళ్లడం మనం చూస్తూ ఉంటాము.
తాజాగా ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో కలిసి విమానంలో ప్రయాణించాలని భావించాడు. ఈ క్రమంలోనే తన పెంపుడు కుక్క కోసం విమానంలో ఉన్న బిజినెస్ కేబిన్ మొత్తం బుక్ చేసుకొని తన పెంపుడు కుక్కతో కలిసి ముంబై నుంచి చెన్నైకి ఎయిర్ ఇండియన్ ఫ్లైట్ లో ప్రయాణం చేశాడు. ఇలా తన కుక్క తో కలిసి ప్రయాణం చేసినందుకు ఆ యజమాని ఏకంగా 2.50 లక్షల రూపాయలను ఖర్చు చేశాడు.
ఎయిర్ ఇండియా విమానం AI-671లో టికెట్స్ బుక్ చేశాడు. ఈ విమానంలో బిజినెస్ క్లాస్ లో 12 సీట్లు ఉంటాయి. అయితే తనకెంతో ఇష్టమైన పెంపుడు కుక్కకు ఎంతో సౌకర్యవంతంగా, విలాసవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో సదరు యజమాని ఇంత పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేసి ముంబై నుంచి చెన్నై కి చేరుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఎంతో మంది ఆశ్చర్యపోతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…