సాధారణంగా మనం ఏడ్చినా, నవ్వినా మన కంటిలో నుంచి కన్నీళ్లు వస్తాయి. కానీ మీరెప్పుడైనా కళ్ల నుంచి రాళ్లు రాలడం చూశారా. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ పరిధిలో ఉన్న గుర్సాహైగంజ్ అనే ప్రాంతంలో చాందిని అనే బాలిక ఎడమ కంటిలో నుంచి రాళ్ళు పడుతున్న ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ క్రమంలోనే తన కూతురిని ఈ సమస్య నుంచి కాపాడుకోవడం కోసం తమ తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.
చాందిని జూలై 15వ తేదీ నుంచి ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడుతోంది. ఈమె ఏడ్చిన కంటిని కొద్దిగా నులిమినా ఎడమ కంటి నుంచి చిన్నపాటి సైజులో ఉన్న రాళ్ళు పడటంవల్ల తన కన్ను దురద పెట్టి తీవ్ర నొప్పి కలిగిస్తుందని బాధితురాలు పేర్కొంటోంది. అయితే తనకు మెరుగైన చికిత్స కోసం ఎన్నో ప్రముఖ ఆస్పత్రులకు చూపించినా.. డాక్టర్లు ఈ విషయం తెలుసుకొని ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు చాందిని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో కూడా ఈ విధమైనటువంటి సమస్యలతో ఎంతో మంది బాధ పడ్డారు. అయితే రెండు కళ్ళలో చిన్నపాటి రాళ్లు పడటం చూశాము కానీ ఈ బాలికకు మాత్రం ఒకే కన్నులో నుంచి రాళ్లు పడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మెరుగైన వైద్య చికిత్స చేయిస్తే బాలిక ఈ సమస్య నుంచి గట్టెక్కుతుందని, బాలికకు చికిత్స చేయించడం కోసం ప్రభుత్వం సహాయం చేయాలని బాధితురాలి తండ్రి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…