ప్రస్తుత కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణంగా మారింది. అయితే కులాలు వేరుగా ఉన్నవారు పెళ్లిళ్లు చేసుకుంటే పెద్దలు పరువు హత్య అంటూ వారిని హత్య చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. తాజాగా ఇలాంటి పరువు హత్య తమిళనాడులో చోటు చేసుకుంది. ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారన్న కారణంతో ఆ పెళ్లైన జంటకు దారుణంగా ముక్కు, చెవిలలో విషాన్ని నింపి చంపేశారు. ఈ
ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని కుప్పందత్త గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కుప్పందత్త గ్రామానికి చెందిన మురుగేశన్ అనే యువకుడు ఇంజనీరింగ్ చదివాడు. అతడు అదే ప్రాంతానికి చెందిన మరో సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలపగా పెళ్లికి అంగీకరించలేదు. ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకున్నప్పటికీ వీరిని చంపేస్తామని బెదిరించారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత అందరు పెద్దలు మాదిరిగానే వీరు తమ పెళ్లి అంగీకరిస్తారని ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుని వేరే చోట నివాసం ఉంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి, అబ్బాయి తరపు కుటుంబ సభ్యులు వారికి మాయమాటలు చెప్పి వారికి ఘనంగా పెళ్లి చేస్తామని నమ్మించి వారి వెంట తీసుకు వచ్చారు. అయితే వారు ఊరికి కాకుండా శ్మ శానం వైపు తీసుకెళ్లడంతో వారిని చంపబోతున్నారని పసిగట్టిన ఆ జంట పారిపోవడానికి ప్రయత్నం చేశారు. అయితే పక్కా ప్లాన్ తో వచ్చిన కుటుంబ పెద్దలు వారి వెంట తీసుకు వచ్చిన విషాన్ని ఆ జంట ముక్కులలో నుంచి శరీరంలోకి ఎక్కించారు. ఈ క్రమంలోనే వారిద్దరూ మరణించారని తెలుసుకున్న తర్వాత శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన తెలిసిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు 12 మందిని కస్టడీలోకి తీసుకుని ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…