సాధారణంగా ఏదైనా పని చేయాలంటే మన శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా ఉండాలని భావిస్తాము. ఈ క్రమంలోనే కొందరు శరీరంలో అవయవాలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ ఎలాంటి చిన్న పని చేయకుండా సోమరితనంతో బద్ధకంగా ఉంటారు. కానీ తన శరీరంలో కాళ్లు లేకపోయినా చేతుల సహాయంతో పరుగులు తీస్తూ గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకున్నాడు.. యూఎస్ కి చెందిన జియోన్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
జియోన్ కు పుట్టుకతోనే కాడల్ రిగ్రెషన్ అనే సిండ్రోమ్ వచ్చింది. ఇది ఒక జెనెటిక్ డిజార్డర్. ఈ వ్యాధితో పుట్టినప్పటికీ ఏ మాత్రం తనలో నిరుత్సాహం లేకుండా కాళ్లు లేకున్నప్పటికీ చేతులు ఉన్నాయి కదా.. అంటూ చేతులతో తన కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకునేవాడు. ఈ క్రమంలోనే ప్రతి రోజు జిమ్ కు వెళ్లి వర్క్ అవుట్స్ చేసేవాడు. జియోన్ కి చిన్నప్పటి నుంచి ఒక లక్ష్యం ఉండేది. ఎలాగైనా తను రెజ్లర్, అథ్లెట్ లేదంటే ఒలింపిక్స్ లో గానీ మెడల్ సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నాడు.
ఈ లక్ష్యంతోనే గ్రౌండ్ లోకి దిగి తన కాళ్లు లేకున్నప్పటికీ చేతుల సహాయంతో పరుగు తీయడం ప్రాక్టీస్ చేశాడు. ఇలా చేతులతో పరుగులు తీస్తూ తను అనుకున్న విధంగానే రెజ్లర్, అథ్లెట్ అయ్యాడు. ఈ క్రమంలోనే 20 మీటర్ల దూరాన్ని, 4.78 సెకండ్లలో అత్యంత వేగంగా పరుగు తీసి గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఇది కాస్తా వైరల్ గా మారింది. పుట్టుకతోనే కాళ్లను కోల్పోయిన జియోన్ ఏ మాత్రం నిరుత్సాహ పడకుండా దృఢసంకల్పంతో తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…