రద్దీగా ఉండే బస్సులు లేదా రైళ్లలో సీటు దొరకడం అంటే కష్టమే. ప్రారంభం అయ్యే స్టేషన్‌లో మాత్రమే మనకు సీట్లు దొరుకుతాయి. మధ్యలో ఎక్కితే చివరి వరకు నిలబడాల్సిందే. మన అదృష్టం బాగుంటే సీట్ దొరుకుతుంది. లేదంటే ప్రయాణం పూర్తయ్యే వరకు కాళ్లకు పని చెప్పాల్సిందే. అయితే అలాంటి స్థితిలో ఉన్న ఓ వ్యక్తి మాత్రం ఓ చిన్న ట్రిక్ ప్రయోగించి సీటును దక్కించుకున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఓ సారి లుక్కేయండి.
ఢిల్లీ మెట్రో రైలులో జరిగిందీ ఘటన. రైలులో రద్దీగా ఉండడంతో కొందరు నిలబడ్డారు. అయితే ఓ యువకుడు మాత్రం ఫిట్స్ వచ్చినట్లు నటించాడు. దీంతో అతని ఎదురుగా సీట్లలో ఉన్నవారు సీట్లు ఖాళీ చేశారు. అది గమనించిన ఆ యువకుడు వెంటనే కూర్చోలేదు. కానీ కూర్చున్నాక మళ్లీ ఫిట్స్ వచ్చినట్లు చేశాడు. దీంతో చుట్టూ చూస్తున్న వారు అతనికి ఏమైందా ? అని కంగారు పడ్డారు.
View this post on Instagram
అయితే అతను సీట్ కోసమే అలా చేశాడని అతన్ని చూస్తేనే ఎవరికైనా అర్థమవుతుంది. ఆ సమయంలో ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా ఆ వీడియో వైరల్ గా మారింది. రైలులో సీటు దక్కించుకోవడం కోసమే అతను అలా చేశాడని నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. కానీ కొందరు మాత్రం దీన్ని చాలా చీప్ ట్రిక్ అని అభివర్ణిస్తున్నారు. ఏది ఏమైనా ఆ వీడియో మాత్రం అందరికీ నవ్వు తెప్పిస్తోంది.