సాధారణంగా పుట్టినరోజు వేడుకలు అంటే ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.చిన్నపిల్లలకి అయితే చుట్టుపక్కల వారు అందరినీ పిలిచి వేడుకలో నిర్వహించగా పెద్దవారు తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ రోజంతా పార్టీలు చేసుకుంటూ ఎంతో ఎంజాయ్ చేస్తారు.అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉంటూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో ఉత్తమమని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇంట్లో ఉండటం కన్నా ఉత్తమమైన మార్గం మరొకటి లేదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ముంబైకి చెందిన సమితా పాటిల్ అనే మహిళ.. తన పుట్టిన రోజుకు స్నేహితులను ఇంటికి పిలవడకుండా బాధ్యతగా వ్యవహరించింది. ఏప్రిల్ 22న ఈమె పుట్టినరోజు కావడంతో ఆమె ఫ్రెండ్స్ పార్టీ అడిగారు. అందుకుగాను ఆమె ‘‘లాక్‌డౌన్ నడుస్తోంది. ఇంట్లోనే ఉండండి, సేఫ్‌గా ఉండండి’’ అని తెలిపింది.
సమితా చాట్ హిస్టరీని స్క్రీన్ షాట్ తీసి ముంబై పోలీసులకు షేర్ చేసింది. ఇది చూసిన ముంబై పోలీసులు ఆమె ఇంటి అడ్రస్ అడిగారు. అలా పోలీసులు ఎందుకు అడిగారు ఆమెకు తెలియడం లేదు. అయితే కొంత సేపటికి ఆమె ఇంటి అడ్రస్ కి ఒక కేక్ వెళ్ళింది. దానిపై రెస్పాన్సిబుల్ సిటిజన్ అని రాసి ఉంది. ఈ కేకును ముంబై పోలీసులు తన పుట్టిన రోజు కానుకగా శుభాకాంక్షలు తెలుపుతూ పంపించారు.ఇదే విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో నెటిజన్లు ముంబై పోలీసుల పై ప్రశంసలు కురిపిస్తున్నారు.