మొబైల్స్ తయారీదారు షియోమీ.. ఎంఐ 11ఎక్స్, 11ఎక్స్ ప్రొ పేరిట రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను భారత్‌లో విడుదల చేసింది. వీటిల్లో 6.67 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వీటికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఈ ఫోన్ల డిస్‌ప్లే క్వాలిటీ బాగుంటుంది. ఎంఐ11ఎక్స్ లో స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేయగా, 11ఎక్స్ ప్రొ స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ను అమర్చారు. రెండింటిలోనూ 8జీబీ ర్యామ్ లభిస్తుంది.
ఎంఐ 11ఎక్స్ లో వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, 11ఎక్స్ ప్రొ లో 108 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇక 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 5 మెగాపిక్సల్ టెలిఫోటో లెన్స్ రెండింటిలోనూ వెనుక వైపు ఉన్నాయి. డాల్బీ అట్మోస్, 4520 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లను వీటిల్లో అందిస్తున్నారు. ఈ ఫోన్లకు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. కనుక వీటిని 52 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్ చేయవచ్చు.
షియోమీ ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రొ ఫీచర్లు
- 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
- 2400 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
- ఎంఐ 11 ఎక్స్ – ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్
- ఎం 11 ఎక్స్ ప్రొ – ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్
- 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్
- ఎంఐ 11ఎక్స్ – 48, 8, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
- ఎంఐ 11ఎక్స్ ప్రొ – 108, 8, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
- 20 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రా రెడ్ సెన్సార్
- డాల్బీ అట్మోస్, 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.1
- యూఎస్‌బీ టైప్ సి, 4520 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
షియోమీ ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రొ స్మార్ట్ ఫోన్లు సెలెస్టియల్ సిల్వర్, లూనార్ వైట్ కలర్ ఆప్షన్లలో విడుదలయ్యాయి. ఎంఐ11ఎక్స్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.29,999 గా ఉండగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.31,999గా ఉంది. ఏప్రిల్ 27వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను అమెజాన్‌తోపాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్స్‌లో విక్రయిస్తారు.
ఎంఐ 11ఎక్స్ ప్రొ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.39,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.41,999గా ఉంది. ఈ ఫోన్‌ను అమెజాన్‌తోపాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్‌లలో విక్రయిస్తున్నారు.
లాంచింగ్ సందర్బంగా ఈ ఫోన్లపై ఆఫర్లను అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో ఎంఐ 11ఎక్స్ ఫోన్‌పై రూ.3500, ఎంఐ 11ఎక్స్ ప్రొ ఫోన్‌పై రూ.4000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఎంఐ 11ఎక్స్‌ను కొన్నవారు ఎంఐ బ్యాండ్ 5 ను రూ.500 కే కొనుగోలు చేయవచ్చు.