వైర‌ల్

పీకల దాకా మద్యం సేవించిన యువతి.. మత్తులో ఏకంగా ఆర్మీ వాహనాన్నే తన్నింది.. వీడియో..

పీకలదాకా మద్యం సేవిస్తే కొందరు వింతగా ప్రవర్తిస్తుంటారు. కొందరైతే ఇతరుల మీద దాడికి దిగుతుంటారు. అనవసరంగా న్యూసెన్స్‌ చేస్తుంటారు. ఓ యువతి కూడా సరిగ్గా ఇలాగే చేసింది. మద్యం మత్తులో నడి రోడ్డుపై రెచ్చి పోయింది. ఏకంగా ఆర్మీ వాహనానికి ఎదురుగా నిలబడి దాని తన్నింది. వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నడిరోడ్డుపై 22 ఏళ్ల ఓ యువతి పీకలదాకా మద్యం సేవించి హల్‌చల్‌ చేసింది. తనకు ఎదురుగా వచ్చిన ఆర్మీ వాహనాన్ని ఆపి దానికి ఎదురుగా నిలబడి కాలితో తన్నింది. వాహనానికి చెందిన హెడ్ లైట్‌పై తన్నుతూ దాన్ని ధ్వంసం చేసింది.

ఈ క్రమంలో వాహనం నుంచి ఓ ఆర్మీ అధికారి బయటకు వచ్చి ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆమె వినలేదు. దీంతో స్థానికులు సమీపంలో ఉన్న పాడవ్‌ పోలీస్‌ స్టేషన్‌కు కాల్‌ చేయగా వారు ఓ మహిళా కానిస్టేబుల్‌ను పంపించారు. ఆ యువతిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

అయితే ఢిల్లీ నుంచి ముగ్గురు మోడల్స్‌కు గ్వాలియర్‌కు ఓ ఈవెంట్‌ నిమిత్తం వచ్చారు. కానీ వారిలో ఈ ఒక్క యువతి మద్యం సేవించి అలా చేసింది. దీంతో విషయం తెలుసుకున్న మరో ఇద్దరు మోడల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల కాళ్ల మీద పడ్డారు. తాము ఢిల్లీ నుంచి ఈవెంట్‌ కోసం వచ్చామని, ఆమె చేసిన పనికి చింతిస్తున్నామని, దయచేసి విడిచి పెట్టాలని కోరారు. దీంతో పోలీసులు ఆ మద్యం యువతిని బెయిల్‌ మీద విడిచిపెట్టారు.

కాగా ఆ సమయంలో తీసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మద్యం మత్తులో ఏకంగా ఆర్మీ వాహనాన్నే తన్నడంపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM