ప్రమాదం ఎప్పుడు ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో ఎవరికి తెలియదు. ముఖ్యంగా రహదారులు, రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాలలో కొద్దిగా ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించిన ప్రాణాలు గాలిలో కలిసి పోతాయి. అచ్చం ఈ తరహాలోనే ఓ చిన్నారి రైల్వే ప్లాట్ ఫామ్ మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్నఫలంగా రైల్వే పట్టాలపై పడ్డాడు.దీంతో అక్కడ ఉన్నటువంటి రైల్వే ఉద్యోగి సకాలంలో స్పందించి ప్రాణాలకు తెగించి మరీ ఆ చిన్నారి ప్రాణాలు కాపాడిన ఘటన ముంబై వాంఘాని రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది.
ముంబై వాంఘాని రైల్వే స్టేషన్ 2 వ ప్లాట్‌ఫాం వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా చిన్నారి రైల్వే పట్టాలపై పడిపోయింది. తనతోపాటు ఉన్న వ్యక్తికి ఏం చేయాలో తోచక గట్టిగా కేకలు వేస్తున్నాడు. అంతలోనే అటువైపుగా రైలు అధిక వేగంతో దూసుకొస్తోంది. ఇది గమనించిన మయూర్ షెల్ఖే అనే రైల్వే ఉద్యోగి పట్టాలపై పరుగులు పెడుతూ ఆ చిన్నారి ప్రాణాలను నిమిషాల వ్యవధిలో కాపాడాడు.
మయూర్ షెల్ఖే అనే రైల్వే ఉద్యోగి రైలుకు ఎదురుగా వెళ్లి చిన్నారిని పట్టాలపై నుంచి ఫ్లాట్ ఫామ్ మీదకు వేసి తను కూడా సెకండ్ల వ్యవధిలో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటన మొత్తం సీసీటీవీ లో రికార్డ్ కావడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తోపాటు నెటిజన్లు మయూర్ షెల్ఖే చేసిన ధైర్య సాహసానికి ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…