ప్రస్తుత కాలంలో ఒక మనిషిపై రోజు రోజుకూ మానసిక ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కొన్నిసార్లు ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య అనే ఆప్షన్ ని ఎంచుకుంటున్నారు. ఈ విధంగా ఎంతో మంది ఆర్థికపరమైన ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, మానసిక క్షోభతో మరణించే వారు చాలా మందే ఉంటున్నారు. తాజాగా ఢిల్లీలోని ఆండ్రూ గంజ్ ఫ్లైఓవర్ పైకి ఎక్కి ఓ వ్యక్తి తనకు బ్రతకడం ఇష్టం లేదని చచ్చిపోతా అంటూ హడావిడి చేశాడు.
కాగా ఫ్లై ఓవర్ పైకి ఎక్కిన వ్యక్తిని గమనించిన స్థానికులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతనిని ఫ్లైఓవర్ నుంచి కిందికి దించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అతను దిగనని పట్టుబట్టాడు. దీంతో పోలీసులు కింద నెట్ ఏర్పాటు చేశారు. అనంతరం అతన్ని బుజ్జగించి కిందకు తీసుకువచ్చారు. అయితే సెప్టెంబర్ 12వ తేదీన జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
आज शाम छत्त पर टहलते समय अचानक इस शख्स पर नजर पड़ी,बिना समय गवाये स्थानीय SHO को कॉल किया और वह 5मिनट के भीतर मेरे द्वारा बताई गई जगह पर पुलिस ने पहुँच कर शख्स को जो कि शराब के नशे में था,बेरोजगार, परेशान था,आत्महत्या करना चाहता था,की जिंदगी को बचा लिया।@DelhiPolice 🇮🇳🙏#Delhi pic.twitter.com/dIaBuFSrmy
— Alka Lamba 🇮🇳 (@LambaAlka) September 12, 2021
అనంతరం కిందికి దిగిన వ్యక్తి పోలీసులతో మాట్లాడుతూ.. కేవలం తనకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండడం వల్లే ఆత్మహత్య చేసుకోవాలని భావించానని తెలియజేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ ఆత్మహత్య మార్గం కాదంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.