నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ శుభవార్తను తెలిపింది. నార్తర్న్ రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న 3093 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం రైల్వే శాఖ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభం కాగా అక్టోబర్ 20వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఈ క్రమంలోనే ఈ ఉద్యోగాలకు ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. ఈ ఉద్యోగాలు చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా పది లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి సంబంధిత ట్రేడ్ ఐటీఐ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 సంవత్సరాలకు మించి ఉండకూడదు.
అర్హత కలిగిన ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులకు ఆఖరి గడువు అక్టోబర్ 20వ తేదీ. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు https://rrcnr.org/అనే వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు.