ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఈ క్లిష్ట పరిస్థితులలో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలని, ఎలాంటి శుభకార్యాల కైనా కేవలం కొంత మంది సమక్షంలో జరగాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలను జారీ చేశాయి. ఇక చావుకు అయితే కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకావాలని తెలిపింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో మనుషులు చనిపోతేనే బంధువులు ఎవరూ లేకుండా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కానీ కర్ణాటకలో మాత్రం ఓ వింత ఘటన చోటు చేసుకుంది.
కర్ణాటకలోని బెలగావిలో స్థానిక మత సంస్థకు చెందిన ఓ గుర్రం అనారోగ్యానికి గురై చనిపోయింది. ఈ విధంగా గుర్రం చనిపోవడంతో దానికి అంత్యక్రియలను నిర్వహించారు. ఈ క్రమంలోనే గుర్రానికి నివాళులు అర్పించడం కోసం వందలాది మంది పాల్గొని గుర్రానికి నివాళులర్పించి అంత్యక్రియలను పూర్తి చేశారు.
#WATCH Hundreds of people were seen at the funeral of a horse in the Maradimath area of Belagavi, yesterday, in violation of current COVID19 restrictions in force in Karnataka pic.twitter.com/O3tdIUNaBN
— ANI (@ANI) May 24, 2021
ఈ గుర్రం అంత్యక్రియల్లో పాల్గొన్న ఏ ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలను పాటించడం లేదు. ఎవరు కూడా కరోనా జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పోలీసులు ఈ ఘటనపై స్పందించి కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో వీరిపై కేసు నమోదు చేశారు.అదేవిధంగా గుర్రం అంత్యక్రియలలో పాల్గొన్న వారందరూ కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం ఈ గుర్రం అంత్యక్రియలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.