ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా ఉన్న నేపథ్యంలో పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించారు. ఈ మేరకు కు కు తెలంగాణలో కేసుల సంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణలో కూడా లాక్ డౌన్ అమలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటూ లాక్ డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం మధ్యాహ్నం ఫిలింనగర్‌లోని సీవీఆర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన లాక్‌డౌన్ చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు విచిత్ర సంఘటన ఎదురైంది.
విధుల నిర్వహణలో భాగంగా ప్రతి ఒక్క వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్న పోలీసులకు ఒక వ్యక్తి తన కారులో కుక్కను తీసుకు వెళ్తు కనిపించాడు. ఈ క్రమంలోనే లాక్ డాన్ ఆంక్షలు అమలులో ఉండగా,బయటికి ఎందుకు వచ్చారని ఎస్‌ఐ నవీన్‌రెడ్డి ప్రశ్నించగా.. అందుకు సదరు వ్యక్తి ఒక విచిత్రమైన సమాధానం చెప్పారు.
తన కుక్కకు చాలా జ్వరంగా ఉందని, మందులు వేయకపోతే చచ్చిపోయేలా ఉంది. అందుకోసమే ఆస్పత్రికి తీసుకు వెళ్తున్నాను.. దయచేసి కుక్క పరిస్థితి చూసైనా మమ్మల్ని పంపించండి అంటూ యజమాని పోలీసులను వేడుకోగా పోలీసులు సైతం కుక్కను చూడగానే చలించిపోయారు. ఈ క్రమంలోనే పోలీసులు సరైన వైద్యం చేయించడం కోసం వారిని వెంటనే ఆస్పత్రికి పంపిన ఘటన సివిఆర్ జంక్షన్ చెక్ పోస్ట్ వద్ద చోటుచేసుకుంది.