ఉత్తరాఖండ్ ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు నదులు పొంగిపోర్లడంతో జనజీవనం స్తంభించిపోయింది.గత కొద్ది రోజుల క్రితం వర్షాల ధాటికి కొండ చరియలు విరిగిపడగా తాజాగా అధిక వర్షాల కారణంగా ఓ భవంతి నేలమట్టమైంది. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉత్తరాఖండ్ జోషిమఠ్‌లోని ఝాడ్కుల సమీపంలో ఉన్నటువంటి ఒక హోటల్ భవంతి ఉంది. అయితే ఈ భవనం పక్కనే ఒక పెద్ద లోయ ఉంది. వర్షం కారణంగా మట్టికొట్టుకు పోవడంతో భవనం ప్రమాదస్థాయికి చేరుకుంది.ఈ క్రమంలోనే భవనం కూలిపోతుందని ముందుగా గ్రహించిన నిర్వాహకులు అందులో ఉన్నటువంటి ప్రజలను సురక్షితంగా బయటకు పంపించారు. ఈ వి ధంగా హోటల్లో ఉన్న వారిని బయటకు పంపించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే లోయ కారణంగా మట్టికొట్టుకు పోవడం వల్లే ఆ భవనం కుప్పకూలి పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో జనజీవనం ఆగిపోయింది.ఈ క్రమంలోనే కొండచరియలు విరిగిపడటంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో అని అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
#WATCH | Uttarakhand: A part of a hotel building collapses near Jhadkula in Joshimath.
The administration had vacated the hotel this morning. pic.twitter.com/zaKgVkVLZq
— ANI (@ANI) August 7, 2021