మన జీవితంలో ఆధార్ కార్డ్ ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఇతర ఐడెంటి కార్డుల మాదిరిగానే ఆధార్ కార్డు కూడా మనకు గుర్తింపు కార్డు అని చెప్పవచ్చు.అయితే మన రోజు వారీ కార్యకలాపాలలో ఎంతో ముఖ్యమైన ఆధార్ కార్డు లో ఏవైనా తప్పులు ఉన్న లేదా చిరునామా ఉన్న ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ విధంగా మార్చుకోవచ్చు. మరి ఆధార్ కార్డులో చిరునామా ఎలా మార్చుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
*ముందుగా బాధితులు UIDAI అనే వెబ్ సైట్ కు వెళ్లి uidai.gov.in వెబ్ సైట్ కు వెళ్లి లింక్ ఓపెన్ చేయాలి.
*లింక్ ఓపెన్ కాగానే కుటుంబసభ్యుల ఆధార్ కార్డుతో లాగిన్ కావాలి. ఇలా లాగిన్ అయిన తరువాత ఆధార్ కార్డు నెంబర్ ఫోన్ నెంబర్ ను వెరిఫై చేసుకోవాలి.
*ఈ వెరిఫికేషన్ లో ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకునే లింక్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా లింక్ ఓపెన్ అవగానే మీరు ఏ అడ్రస్ మార్చుకోవాలనుకుంటున్నారో ఆ అడ్రస్ ఎంటర్ చేయాలి.
*ఈ విధంగా అడ్రస్ మార్చుకునే సమయంలో ఒకసారి మన మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకొని మార్చుకోవాలి. ఆ తర్వాత ఆధార్ అడ్రస్ మార్చుకోవడానికి సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ (SRN) ఎంటర్ చేయాలి.
* SRN ఎంటర్ చేసిన తర్వాత మీ అడ్రస్ మార్చుకునే రిక్వెస్ట్ పూర్తి చేయాలి.ఈ విధమైనటువంటి ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీ ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. ఆ ఓటిపి ను ఎంటర్ చేసి కొత్త అడ్రస్ రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ క్రమంలోనే 15 రోజుల తర్వాత మీ కొత్త అడ్రస్ తో మరొక ఆధార్ కార్డు మీకు వస్తుంది. ఇలా ఇంట్లోనే సులభంగా ఆధార్ కార్డ్ అడ్రస్ మార్చుకోవచ్చు.