పెళ్ళి ఊరేగింపు అంటే స్నేహితులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. డీజే పాటలు, డాన్సులు చూడటానికి ఎంతో ఆనందంగా ఉంటుంది.ఈ విధంగా పెళ్లిలో వరుడు స్నేహితులు వారు చిందులు వేయడమే కాకుండా వరుడి చేత డాన్సులు వేయించడం మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఓ పెళ్లిలో స్నేహితుడు వరుడిని తన భుజాలపై ఎత్తుకుని డాన్స్ చేశాడు. అయితే వరుడు ఉన్నఫలంగా అదుపు తప్పి కింద పడటంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ పెళ్లికి సంబంధించిన పలు ఫన్నీ వీడియోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంలో ఎంతో పాపులర్ అయిన నిరంజనం ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ స్నేహితుడు వరుడిని తన భుజాలపై ఎత్తుకుని చిందులు వేసాడు.అయితే ఆ కుర్రాడు వరుడు చేతులకి బదులుగా కాళ్ళని పట్టుకుని డాన్స్ వేయడంతో అదుపుతప్పి రోడ్డుపై పడ్డాడు.
View this post on Instagram
ఆ విధంగా వరుడు రోడ్డుపై పడడంతో వెంటనే బంధువులందరూ వచ్చి అతనిని పైకి లేపారు. కానీ ఈ వీడియోలో అతను పడిన సంఘటన చూస్తే అతనికి నడుము విరిగి ఉంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అయ్యో పాపం పెళ్లి తర్వాత తన పరిస్థితి ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరెందుకాలస్యం మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.