Fake Garlic : ప్రస్తుత తరుణంలో మార్కెట్‌లో వస్తున్న వస్తువుల్లో ఏది అసలుదో, ఏది నకిలీదో గుర్తించడం అత్యంత కష్టంగా మారింది. చాలా మంది వస్తువులకు నకిలీలను తయారు చేస్తున్నారు. అలాగే ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు. కల్తీ అవుతున్న ఆహారాలను తింటున్న ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. కల్తీలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నప్పటికీ అక్రమార్కులు మాత్రం కొత్త దారులను వెతుకుతూనే ఉన్నారు. కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మార్కెట్‌లో నకిలీ వెల్లుల్లి కలకలం రేపుతోంది.
ఇప్పటికే మార్కెట్‌లో అనేక రకాల ఆహారాలను కల్తీ చేసి అమ్ముతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో వెల్లుల్లి కూడా చేరింది. తాజాగా మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో నకిలీ వెల్లుల్లి బాగోతం బయట పడింది. ఓ చోట వెల్లుల్లిని కొనుగోలు చేసిన కస్టమర్ దాన్ని తెరిచి చూడగా మొత్తం అందులో సిమెంట్ కనబడింది. దాన్ని అతను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో నకిలీ వెల్లుల్లిని చూసిన నెటిజన్లు ఖంగు తింటున్నారు. వెల్లుల్లిని ఇలా కూడా కల్తీ చేస్తారా.. అని షాకవుతున్నారు.
అయితే వీటిని ఎవరు తయారు చేస్తున్నారు, ఎక్కడ ఎలా తయారవుతున్నాయి.. అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. కానీ మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ నకిలీ వెల్లుల్లిని చూసి ప్రజలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలే వెల్లుల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఈ నకిలీ వెల్లుల్లి నుంచి ఎలా బయట పడాలి.. అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మీరు కూడా వెల్లుల్లిని కొంటే ఎందుకైనా మంచిది ఒక్కసారి ఓపెన్ చేసి చూశాకే కొనండి. లేదంటే మోసపోతారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…