BSNL Rs 997 Prepaid Plan : ప్రైవేటు టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ లు మొబైల్ చార్జిలను విపరీతంగా పెంచడంతో సామాన్య ప్రజలు చాలా మంది ఇప్పటికే BSNLలోకి మారిపోయారు. ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. చాలా చోట్ల BSNL సిమ్‌ల కోసం ప్రజలు క్యూలు కడుతున్నారు. ఇక త్వరలోనే BSNLలో 4జితోపాటు 5జి కూడా వస్తుందని చెబుతుండడంతో ఈ సిమ్‌లను తీసుకునేందుకు ప్రజలు ఆసక్తిని చూపిస్తున్నారు. BSNLలో ఇతర కంపెనీలతో పోలిస్తే చాలా తక్కువ ధరలకే రీచార్జి ప్లాన్లు అందుబాటులో ఉండడం విశేషం.
BSNLలో ప్రీపెయిడ్ వినియోగదారులు రూ.997తో రీచార్జి చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 160 రోజులు కాగా ఇదేలాంటి ప్లాన్‌ను ఇతర కంపెనీలు అయితే కేవలం 84 రోజుల వాలిడిటీతోనే అందిస్తున్నాయి. ఇక BSNL అందిస్తున్న రూ.997 ప్లాన్‌లో కస్టమర్లకు 160 రోజుల వాలిడిటీతోపాటు రోజుకు 2జీబీ చొప్పున డేటా లభిస్తుంది. అలాగే 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా వస్తాయి. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.
ఇతర నెట్‌వర్క్‌లలో ఇదే ప్లాన్ ద్వారా కేవలం 84 రోజుల వాలిడిటీని మాత్రమే పొందవచ్చు. కానీ BSNL ద్వారా మాత్రం దాదాపుగా అంతకు రెట్టింపు మొత్తంలో వాలిడిటీ లభిస్తుంది. అందువల్లే చాలా మంది BSNLకు మారిపోతున్నారు. ఇక ఇప్పుడు చాలా చోట్ల రహదారుల పక్కన కూడా స్టాండ్లలో BSNL సిమ్‌లను విక్రయిస్తుండగా.. అవన్నీ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే BSNL సిమ్‌ను మొదటిసారి పొందే ప్రీపెయిడ్ కస్టమర్లు ముందుగా రూ.249 చెల్లించాల్సి ఉంటుంది. కానీ సిమ్ ఫ్రీగా ఇస్తారు. ఈ ప్లాన్ వాలిడిటీ నెల రోజుల వరకు ఉంటుంది. సిమ్ తీసుకున్న వెంటనే 4 నుంచి 24 గంటల్లోగా యాక్టివేట్ కూడా అవుతుంది. ఎలాంటి వెరిఫికేషన్ కాల్ కూడా చేయాల్సిన పనిలేదు. ఆధార్ బయోమెట్రిక్‌తో సిమ్ పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…