Viral Video : పెళ్లిళ్లు జరిగినప్పుడు అతిథులకు విందు భోజనం వడ్డించడం మామూలే. ఎవరి స్థోమతకు తగినట్లుగా వారు వివాహ భోజనాలు పెడుతుంటారు. ఇక తెలంగాణలో అయితే చాలా వరకు వివాహాల్లో కచ్చితంగా నాన్ వెజ్ ఉండి తీరాల్సిందే. నాన్ వెజ్ లేనిదే తెలంగాణలో ఏ శుభ కార్యం పూర్తి కాదనే చెప్పాలి. అయితే నాన్ వెజ్ పెట్టి అందరికీ సరిపోయేలా వడ్డిస్తే ఓకే. లేదంటే గొడవలు అయిపోతాయి. అవును, సరిగ్గా ఇలాగే జరిగింది అక్కడ. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఉన్న నవీపేట అనే ప్రాంతంలో ఈమధ్యే ఒక పెళ్లి జరిగింది. వివాహ వేడుకలో భాగంగా మటన్ కూరను వడ్డించారు. అయితే తమకు మటన్ కూరను సరిగ్గా వేయడం లేదని, కొంచెమే వేస్తున్నారని వరుడు తరఫున వచ్చిన బంధువులు గొడవకు దిగారు. దీంతో చిలికి చిలికి గాలి వానగా మారినట్లు గొడవ కాస్తా పెద్దదైంది.
ఈ క్రమంలో వరుడు, వధువు.. ఇరు పక్షాలకు చెందిన వారు రక్తాలు వచ్చేలా తన్నుకున్నారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఏర్పడేలా చూశారు. తరువాత ఘటనకు పాల్పడిన 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం అంతా బాగానే ఉందని తెలిపారు. అయితే ఈ ఘటన తాలూకు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఈ వీడియోకు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
మటన్ కోసం తలలు పగలగొట్టుకున్నారు
నిజామాబాద్ జిల్లా నవీపేట్లో జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లికొడుకు తరపు వారికి మటన్ తక్కువ వేశారని కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు.
దీంతో ఫంక్షన్ హాల్ రణరంగాన్ని తలపించింది. ఈ ఘటనలో పలువురు గాయపడగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. pic.twitter.com/vQsbG02gZU
— Telugu Scribe (@TeluguScribe) August 29, 2024