Banana Leaf Cutting : ఇప్పుడంటే చాలా మంది భోజనం చేసేందుకు స్టీల్ లేదా ప్టాస్టిక్ ప్లేట్లను ఉపయోగిస్తున్నారు. కానీ పూర్వం రోజుల్లో చాలా మంది మట్టి పాత్రలు లేదా అరటి ఆకులను భోజనం చేసేందుకు ఉపయోగించేవారు. ఇప్పటికీ మనం బయటకు వెళితే కొన్ని రెస్టారెంట్లలో మనకు అరటి ఆకుల్లోనే భోజనం వడ్డిస్తుంటారు. అయితే అరటి ఆకుల్లో భోజనం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేదం చెబుతుంది. అరటి ఆకుల్లో భోజనం చేయడం వల్ల మనకు ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు కలుగుతాయి.
అరటి ఆకుల్లో ఉండే అనేక పోషకాలు మనకు భోజనం ద్వారా లభిస్తాయని వైద్యులు చెబుతుంటారు. అలాగే విషాహారం గనక అరటి ఆకుల్లో ఉంటే ఆకులు నీలి రంగులోకి మారుతాయని, దీంతో మనం విషాహారం తినకుండా ప్రాణాలను రక్షించుకోవచ్చని కూడా చెబుతారు. అయితే అరటి ఆకులను చాలా మంది అలాగే ఉంచి వాటిల్లో భోజనం చేస్తారు. కానీ కొన్ని రెస్టారెంట్లు భిన్న రకాల షేపుల్లో కట్ చేసిన అరటి ఆకులను తమ కస్టమర్ల కోసం ఉపయోగిస్తుంటాయి. ఈ క్రమంలోనే దీని ప్రాతిపదికన చాలా మంది అరటి ఆకులను అమ్మే వ్యాపారాలను కూడా చేస్తున్నారు.
ఇక తాజాగా అలాంటి ఓ అరటి ఆకులను అమ్మే చోట తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో కొందరు వ్యక్తులు అరటి ఆకులను భిన్న ఆకారాల్లో కట్ చేస్తుండడాన్ని గమనించవచ్చు. కొందరు అరటి అరటి ఆకులను రెండుగా చీల్చి ప్యాక్ చేస్తుంటే, ఇంకొందరు చదరం ఆకారంలో వాటిని కట్ చేస్తున్నారు. ఇంకొక వ్యక్తి ఒక ప్లేట్ సహాయంతో ఆకులను వృత్తాకారంలో కట్ చేస్తుండడాన్ని మీరు గమనించవచ్చు. అయితే ఓ వ్యక్తి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. దీన్ని ఇప్పటికే 27.7 మిలియన్ల మంది వీక్షించడం విశేషం.
ఈ వీడియోపై నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు. అరటి ఆకుల్లో తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ వాటిని కట్ చేయడం ఎందుకు. ఆకులను అలాగే ఉంచి కడిగి వాటిలో తినవచ్చు కదా. కట్ చేయడం వల్ల వేస్టేజ్ ఎక్కువగా వస్తుంది.. అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా అరటి ఆకులను విక్రయించే వ్యాపారం అయితే చాలా బాగుంది కదా. దీన్ని కూడా ఆదాయ వనరుగా మార్చుకుని మంచి లాభాలను సంపాదించవచ్చు.
View this post on Instagram