అవసరం మనిషికి ఏ పనైనా నేర్పిస్తుంది. అదేవిధంగా అవసరం అనేది జంతువులకి కూడా ఎలాంటి పనులు అయినా నేర్పిస్తుందని చెప్పడానికి ఈ వీడియోని నిదర్శనమని చెప్పవచ్చు. మనం దప్పికతో ఉన్న కాకి నీటి కోసం కుండలో రాళ్లను వేస్తూ నీరు పైకి తెచ్చుకుని దాహం తీర్చుకున్న కథ గురించి విన్నాము. అయితే అదే దప్పికతో ఉన్న ఓ గున్న ఏనుగు చేతిపంపును కొడుతూ తన దేహాన్ని తీర్చుకున్న ఘటన పశ్చిమబెంగాల్ లో చోటు చేసుకుంది.
సాధారణంగా మనుషులు అత్యంత తెలివైన వారిగా భావిస్తుంటారు.కానీ ఇలాంటి వీడియోలు చూసినప్పుడు జంతువులకు కూడ తెలివి ఉంటుందని భావిస్తున్నాము. ఎంతో దాహంతో ఉన్న గున్న ఏనుగు అలిపుర్దార్‌లోని ఓ పాఠశాల వద్దకు చేరుకొని నీటిని కోసం వెతక సాగింది.ఈ క్రమంలోనే పాఠశాలలో చేతిపంపును గమనించిన ఏనుగు అక్కడికి వెళ్లి అచ్చం మనుషుల మాదిరిగానే తొండంతో చేతిపంపును కొడుతూ వచ్చిన నీటిని తాగుతూ తన దాహాన్ని తీర్చుకుంది.
@susantananda3 @ParveenKaswan at school near Alipurduar, West Bengal. pic.twitter.com/NVagpizN8L
— ASG (@abhijitsgoap) June 15, 2021
ఈ విధంగా దాహంతో ఉన్న ఏనుగు తన తెలివిని ప్రదర్శించి దాహాన్ని తీర్చుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అందరూ మనుషులు చేసే తప్పిదం వల్లే జంతువులకు అడవులలో నీటి సౌకర్యాలు లేక ఇలాంటి కష్టాలు ఏర్పడుతున్నాయని కామెంట్లు చేస్తున్నారు.