యాపిల్ ఐఫోన్లు అంటే చాలా మందికి వాడాలని ఉంటుంది. కానీ వాటి ధర చాలా ఎక్కువ. అందుకనే 4-5 ఏళ్లు పాత అయిన ఐఫోన్లను కొని చాలా మంది వాడుతారు. ఇక పండుగలు, ప్రత్యేక సేల్స్ సమయాల్లో ఇతర కంపెనీలకు చెందిన ఫోన్లు మనకు చాలా తక్కువకే వస్తాయి. కానీ ఐఫోన్లను డిస్కౌంట్లతో అమ్మడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే అమెజాన్‌లో అద్భుతమైన డీల్‌ను యాపిల్ ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్‌పై అందిస్తున్నారు. అది ఎంతటి అద్భుతమైన డీల్ అంటే.. చూస్తేనే షాకవుతారు.
చూశారు కదా.. ఫోన్ ధర రూ.1,59,900 ఉంది. మీకు రూ.1 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్‌ను రూ.1,59,899కు ఇస్తారు. ఎంతటి అద్భుతమైన డీల్ కదా. దీన్నే ఓ యూజర్ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ పిక్ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఈ డీల్‌పై స్పందిస్తున్నారు. తమ దైన శైలిలో ఈ డీల్‌పై సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
యాపిల్‌కు చెందిన ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లు గతేడాది విడుదల కాగా వాటికి ఆదరణ బాగానే లభిస్తోంది. ఐఫోన్ 12 మినీ, 12, 12 ప్రొ, 12 ప్రొ మ్యాక్స్ పేరిట ఆ ఫోన్లు విడుదలయ్యాయి. అయితే ఐఫోన్ 12 మినీకి అంతగా ఆదరణ లభించడం లేదు. దీంతో యాపిల్ ఆ ఫోన్ ఉత్పత్తిని నిలిపివేసింది. అయితే త్వరలోనే ఐఫోన్ ఎస్ఈ 2021 ఎడిషన్‌ను యాపిల్ విడుదల చేయవచ్చని తెలుస్తోంది.
There is a sale on Apple iPhone 12 Pro Max on Amazon pic.twitter.com/gJbA3LTMXK
— Sachin Kalbag (@SachinKalbag) March 26, 2021
Can your calculator calculate the discount percentage?
— Paraj (@gparaj) March 26, 2021
— ॐ (Om Patel) (@LuckydpatelOm) March 27, 2021
https://twitter.com/thisispranks/status/1375453050815475718
https://twitter.com/ShivamMehta013/status/1375486819396030469
Kaun hai yeh log??? Kaise nikalte hai yeh schemes ?
— Sarabjit Singh N (@sarabjitsinghn) March 26, 2021
Wow. I could buy a second iPhone with all the money that I can save in this deal.
— Sania Ahmad (@SaniaAhmad1111) March 27, 2021
— Deva… (@rmdeva) March 27, 2021