Pooja Room Vastu Tips : హిందువులు దేవతలను, దేవుళ్లను గుళ్లల్లోనే కాకుండా ఇంటిలో పూజ గదిని నిర్మించుకుని మరీ పూజిస్తూ ఉంటారు. ఇంటి పూజ గదిలో కుల దేవతలను, వారికి నచ్చిన దేవతా, దేవుడి ఫోటోలను ఉంచి పూజిస్తూ ఉంటారు. ఇది మనసుకు ప్రశాంతతను కలిగించడంతో పాటు జీవితంలో వచ్చే సమస్యల నుండి ఉపశమనాన్ని కూడా కలిగిస్తుంది. అయితే ఎన్ని ప్రత్యేక పూజలు చేసిన ఎంత ఆరాధించిన కొందరు ఎప్పటికి మనసును ప్రశాంతంగా ఉంచులేకపోతారు. అలాగే వారి జీవితంలో ఒక దాని తరువాత ఒకటి సమస్య వస్తూనే ఉంటుంది. ఇంట్లో ఉండే పూజ గది నిర్మాణంలో ఉన్న వాస్తు దోషాలు కూడా ఈ సమస్యలకు కారణం అవుతాయని పండితులు చెబుతున్నారు. వాస్తుశాస్త్రంలో పూజ గది లేదా ఇంట్లో గుడి నిర్మించడానికి కొన్నినియమాలు ఉన్నాయి.
ఈ నియమాలను పాటించకపోవడం వల్ల సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇంట్లో అశాంతి, ధననష్టంతో పాటు ప్రశాంతత కూడా దెబ్బతింటుంది. ఇంట్లో ఉండే పూజ గది విషయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం పూజ గదిలో ఒకటి కంటే ఎక్కువ శంఖాలు పెట్టకూడదు. చాలా మంది తెలిసి తెలియక లేదా అలంకరణ ప్రాయంగా చిన్న పెద్ద శంఖువులను ఉంచుతూ ఉంటారు. కానీ ఇది మంచిది కాదు. కనుక ఇంట్లో పూజ గదిలో ఒక్క శంఖువును మాత్రమే ఉంచాలి. అలాగే చాలా మంది ఇంట్లో పూజ గదిలో మరణించిన పెద్దల ఫోటోలు, తల్లిదండ్రుల ఫోటోలను ఉంచుతారు. కానీ ఇలా చేయకూడదు. మరణించిన వారి ఫోటోలను పూజ గదిలో ఉంచితే ఇంట్లో కష్టాలు వస్తాయి.
మరణించిన వారి ఫోటోలను ఇంటికి దక్షిణ దిశలో ఉంచాలి. అలాగే పూజ గదిలో విరిగిన విగ్రహాలను లేదా ఉగ్ర రూపంలో ఉన్న దేవుడి విగ్రహాలను, ఫోటోలను ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అలాగే పూజ గదిలో అస్థవ్యస్థంగా లేదా చెడు స్థితిలో ఉన్న దేవుడి ఫోటోలను ఉంచకూడదు. ఇది ఇంట్లో ప్రతికూలతను తెస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ఉండే వ్యక్తుల పురోగతి కూడా దెబ్బతింటుంది. అలాగే ప్రతిరోజూ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. దేవుడికి సమర్పించిన పూలను మరుసటి తొలగించాలి. అలాగే పూజ సామాగ్రిని కూడా దేవుడి ఫోటోల దగ్గర ఉంచకూడదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…