Vishalakshi Devi Temple In Kashi : పురాతన మరియు మతపరమైన నగరాల్లో కాశీ కూడా ఒకటి. కాశీ నగరంలో అమ్మవారి అధ్భుతమైన శక్తిపీఠం ఉంది. ఇక్కడ శక్తి పీఠాన్ని దర్శించుకుంటే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. అటువంటి శక్తి ఆరాధన పీఠాలల్లో మాతా విశాలాక్షి ఆలయం కూడా ఒకటి. దేశవ్యాప్తంగా నలుమూలల నుండి ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం శివుని భార్య సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి రాజభవనంలో ఒక యాగంలో తన భర్త చేసిన అవమానానికి బాధపడిన సతీదేవి అదే యాగశాలలో తన శరీరాన్ని వదిలివేసింది. ఆ తర్వాత శివుడు సతీదేవి మృతదేహంతో కల్యాణాన్ని ప్రారంభించాడు. ఆ సమయంలో సృష్టిని రక్షించడానికి శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలను శక్తిపీఠాలు అంటారు.
మొత్తం 51 శక్తి పీఠాలు పరిగణించబడతాయి. పరమశివుడు భుజంపై సతీదేవిని పెట్టుకుని తిరుగుతున్నప్పుడు సతీదేవి కుడి చెవిపోగు, కుడి కన్ను పడిన ప్రదేశమే నేడు మాతా విశాలాక్షి యొక్క నివాసం కాశీగా ప్రసిద్ది చెందింది. అలాగే ఈ శక్తి పీఠాలన్నీ సందర్శించిన తరువాత శివుడు ధ్యానం చేసాడని అతని రూపం నుండే కాలభైరవుడిని సృష్టించాడని నమ్ముతారు. కాశీలోని ఈ శక్తి పీఠానికి దగ్గర్లోనే కాలభైరవుడు కూడా ఉన్నాడు. కాశీలో అమ్మవారైనటువంటి విశాలాక్షి దేవి శక్తిపీఠం కాశీలోని వంకర వీధుల మధ్య ఉంది. శివుడు రోజూ రాత్రి ఇక్కడే నిద్రిస్తాడని నమ్ముతారు. ఈ తల్లి దర్శనం కోసం భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ముఖ్యంగా నవరాత్రుల్లో ఇక్కడ భక్తుల రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది. కాశీలో ఉన్న విశాలాక్షి దేవిని దర్శించుకోవడం వల్ల రోగాలు, దుఃఖాలు దూరమవుతాయని అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని నమ్ముతారు.
అలాగే వివాహం కుదరని మరియు వివాహంలో ఆటంకాలు ఉన్న అమ్మాయిలు వరుసగా 41 రోజుల పాటు మాతా విశాలాక్షిని దర్శించుకోవడం వల్ల సమస్యలు తొలగిపోయి వివాహం జరుగుతుందని కూడా విశ్వసిస్తారు. అలాగే ఇక్కడ మాతా విశాలాక్షి దేవి ఆలయం ద్రావిడ శైలిలో ఉంటుంది. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో ఆలయాలను పోలి ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి పూలమాలలు, పూలు, ప్రసాదాలతో పాటు అలంకరణ వస్తువులు కూడా సమర్పిస్తూ ఉంటారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…