Lord Shani Dev : సనాతన ధర్మంలో ప్రతిరోజూ ఒక దేవుడికి, దేవతకి అంకింతం చేయబడిందన్న సంగతి మనకు తెలిసిందే. అలాగే శనివారం నాడు శని దేవునికి, శనిగ్రహ ఆరాధనకు అంకితం చేయబడింది. శని దేవున్ని కర్మ దాత అని కూడా అంటారు. మనం చేసే మంచి, చెడు పనులను శని దేవుడు గమనిస్తూ దానికి తగినట్టు మనకు ఫలితాలను ఇస్తూ ఉంటాడు. మంచి పనులు చేసేవారికి శుభ ఫలితాలను, చెడు పనులు చేసే వారికి చెడు ఫలితాలను ఇస్తూ ఉంటాడు. శని దేవుడు కోపంగా ఉన్నప్పుడు మన జీవితంలో అనూహ్యకరమైన సంఘటనలు జరగడం ప్రారంభమవుతుంది. దీంతో మనం అనేక కష్టనష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇటువంటి సమస్యలతో బాధపడే వారు శనివారం నాడు నష్టాలను ఎదుర్కొంటున్నవారు శనివారం నాడు శనిదేవున్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించాలి. శని దేవుని కోపం తగ్గి శనిదేవుని అనుగ్రహం మనపై ఉండాలంటే శనివారం నాడు కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయాలని పండితులు చెబుతున్నారు.
శని దేవుని అనుగ్రహం కోసం శనివారం నాడు చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం నాడు శని యంత్రాన్ని పూజించడం వల్ల శని దేవుని అనుగ్రహం లభిస్తుంది. శనిగ్రహం యొక్క చెడు ప్రభావంతో బాధపడే వారు శని యంత్రాన్ని పూజించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అలాగే మాంసాహారం తీసుకోవడం మానేసి శక్తి మేరకు పేదలకు దానం చేయాలి. అలాగే శనివారం నాడు ఆవుకు నువ్వులను తినిపించాలి. అలాగే శనివారం నాడు రావి చెట్టుకు నీటిని సమర్పించాలి. దీనితో పాటు ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. తరువాత రావి చెట్టును తాకి నమస్కరించి చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల శని దేవుడు సంతోషిస్తాడు. ఇక అప్పుల బాధలతో బాధపడే వారు శనివారం నాడు నల్ల ఆవుకు బూందీ లడ్డూలను తినిపించాలి . నుదుటిపై కుంకుమ రాసి ఆవును పూజించాలి. ఇలా చేయడం వల్ల అప్పుల సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.
ఇక శనిదేవున్ని ప్రసన్నం చేసుకోవాలనుకునే వారు శనివారం నాడు ఆవనూనెలో ముఖాన్ని ముంచాలి. తరువాత ఈ నూనెను దానం చేయాలి. అలాగే శనివారం నాడు సాయంత్రం రావి చెట్టు కింద 9 ఆవనూనె దీపాలను వెలిగించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి శని దేవుడిని ప్రార్థించాలి. ఇలా చేయడం వల్ల మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే శనివారం నాడు ఎవరికీ చెప్పకుండా నువ్వులు, శనగపప్పు, నూనె, బెల్లం, నల్లబట్టలను దానం చేయాలి. ఇలా రహస్యంగా చేసే దానాలే మనకు మంచి ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధంగా శనివారం నాడు ఈ పరిహారాలు చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం ఎప్పుడూ మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…