Tulsi Plant Pooja : హిందువులు పవిత్రంగా భావించే మొక్కలల్లో తులసి మొక్క కూడా ఒకటి. తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. తులసి మొక్కకు భక్తి శ్రద్దలతో పూజ చేస్తారు. తులసి మొక్కలో లక్ష్మీ దేవి నివసిస్తుందని విశ్వసిస్తారు. అలాగే తులసి మొక్క లేకుండా విష్ణువు ఆరాధన అసంపూర్తిగా పరిగణిస్తారు. చాలా మంది రోజూ ఉదయం, సాయంత్రం తులసి మొక్కకు నీరు పోసి దీపం వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూలత, ఆనందం, శాంతి నెలకొంటుందని నమ్ముతారు. తులసి మాతను మనం ప్రసన్నం చేసుకోవాలంటే రోజూ పూజ చేసినప్పటికి గురువారం నాడు ప్రత్యేకంగా పూజ చేయాలి. గురువారం నాడు ప్రత్యేకంగా తులసి మొక్కకు పూజ చేయడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందుతాము.
గురువారం నాడు తులసి మొక్కకు పూజ చేయడంతో పాటు తులసి హారతి కూడా చదవాలి. ఇలా చేయడం వల్ల మనకు అన్ని శుభాలు కలుగుతాయి. గురవారం నాడు తులసి మొక్కను ప్రత్యేకంగా పూజించడం వల్ల లక్ష్మీ దేవి ప్రసన్నమవుతుంది. ఆ తల్లి దీవెనలు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి. లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. మన ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతాము. ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల వాతావరణం ఉంటుంది. అలాగే ప్రతిరోజూ తులసి మాతను పూజించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
దుష్టశక్తులు మనకు దూరంగా ఉంటాయి. అంతేకాకుండా తులసి మొక్కను పూజించడం వల్ల ఇంట్లో ఉండే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. సుఖ సంతోషాలు, సంపదలు, సౌభాగ్యం ఎల్లప్పుడూ మన వెంటే ఉంటుంది. కనుక గురువారం నాడు తులసి మాతాను పూజించి ప్రత్యేకంగా హారతి చదవడం మనకెంతో శుభదాయకమని ఇలా చేయడం వల్ల మనకు ఎన్నో మంచి ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…