జ్యోతిష్యం & వాస్తు

Items In Wallet : ఈ వ‌స్తువుల‌ను ఎల్ల‌ప్పుడూ మీ ప‌ర్స్‌లో పెట్టుకోండి.. ల‌క్ బాగా క‌ల‌సి వ‌స్తుంది..!

Items In Wallet : అదృష్టం.. జీవితంలో చాలా మంది ఇది క‌ల‌సి రాద‌ని బాధ‌ప‌డుతుంటారు. కేవ‌లం కొంద‌రికి మాత్ర‌మే అదృష్టం క‌ల‌సి వ‌స్తుందని, తాము ఏం చేసినా దుర‌దృష్టం వెంటాడుతూనే ఉంటుంద‌ని అధిక శాతం మంది బాధ‌ప‌డుతుంటారు. తమ దుర‌దృష్టానికి త‌మ‌ను తామే నిందించుకుంటూ కాలం గ‌డుపుతూ ఉంటారు. అయితే అలాంటి వారు కింద ఇచ్చిన కొన్ని సూచ‌న‌లు పాటిస్తే వారికి ల‌క్ ఎప్పుడూ తోక‌లా వెన్నంటే ఉంటుంద‌ట‌. ఏది చేసినా క‌ల‌సి వ‌స్తుంద‌ట‌. మరికెందుకాల‌స్యం, ల‌క్ క‌ల‌సి రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి.

ఒక రావి ఆకును తెంపి దాన్ని శుభ్రంగా క‌డిగి మీ ప‌ర్స్ లేదా వాలెట్‌లో పెట్టుకోండి. దీంతో ల‌క్ ఎప్పుడూ మీకు క‌ల‌సి వ‌స్తుంది. అంతేకాదు మీ చుట్టూ పాజిటివ్ శ‌క్తి కూడా ఉంటుంది. దేవాల‌యాల‌కు వెళ్లిన‌ప్పుడు బియ్యం గింజ‌ల‌ను ల‌క్ష్మీ దేవికి ఇవ్వ‌డం కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. ఈ క్ర‌మంలో మీ ప‌ర్సులో కొన్ని బియ్యం గింజ‌ల‌ను ఎల్ల‌ప్పుడూ ద‌గ్గ‌ర పెట్టుకున్నా అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది. ఒక 20 రూపాయ‌ల నోటు, రెండు రూపాయి నోట్లు క‌లిపి వాటిని సిల్వ‌ర్ పేప‌ర్‌లో చుట్ట‌గా చుట్టి ప‌ర్సులో పెట్టుకోవాలి. దీంతో ల‌క్ క‌లిసి వ‌స్తుంది. అయితే అలా చుట్టిన డ‌బ్బుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉప‌యోగించ‌కూడ‌దు.

Items In Wallet

శేష‌త‌ల్పంపై ప‌డుకున్న విష్ణువు పాదాల‌ను ఒత్తుతున్న ల‌క్ష్మీ దేవి ఫొటోను ద‌గ్గ‌ర పెట్టుకోవాల‌ట‌. దీని వ‌ల్ల కూడా ల‌క్ క‌ల‌సి వ‌చ్చి అనుకున్న ప‌నులు త్వ‌ర‌గా జ‌రుగుతాయ‌ట‌. తెల్ల‌ని గులక రాళ్ల‌ను ప‌ర్సులో పెట్టుకున్నా అదృష్టం క‌ల‌సి వ‌స్తుంద‌ట‌. పాజిటివ్ శ‌క్తి పెరుగుతుంద‌ట‌. చిన్న‌పాటి కొబ్బ‌రి కాయ‌ల‌తో ఇంట్లో పూజ చేసిన త‌రువాత వాటిని ప‌గ‌ల‌కొట్టి ఆ ముక్క‌ల‌ను ప‌ర్సులో పెట్టుకోవాలి. ఇలా చేసినా పాజిటివ్ శ‌క్తి పెరుగుతుంది. ప‌సుపు రంగులో చిన్న‌గా ఉండే గ‌వ్వ‌ల‌ను ల‌క్ష్మీ గ‌వ్వ‌ల‌ని పిలుస్తారు. వీటిని ద‌గ్గ‌ర పెట్టుకున్నా ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. అనుకున్న ప‌ని జ‌రుగుతుంది.

తామ‌ర పువ్వు విత్త‌నాల‌ను ద‌గ్గ‌ర పెట్టుకుంటే మాన‌సికంగా ఆరోగ్యం క‌లుగుతుంది. అదృష్టం కూడా క‌ల‌సి వ‌స్తుంది. మంత్రించిన శ్రీ‌యంత్రాన్ని ప‌ర్సులో పెట్టుకుంటే ధ‌నం బాగా స‌మ‌కూరుతుంది. అదృష్టం కూడా బాగా వ‌స్తుంది. గోమ‌తి చ‌క్ర అని పిల‌వ‌బ‌డే ప్ర‌త్యేక‌మైన శంకుల‌ను ద‌గ్గ‌ర పెట్టుకుంటే ఆర్థిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. ల‌క్ కూడా క‌ల‌సి వ‌స్తుంది. మానసిక ప్ర‌శాంత‌త క‌లుగుతుంది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM