ఆధ్యాత్మికం

Lord Ganesha : తుల‌సి ఆకుల‌ను వినాయ‌కుడి పూజ‌లో ఎందుకు ఉప‌యోగించ‌రో మీకు తెలుసా..?

Lord Ganesha : హిందూ సాంప్ర‌దాయంలో తుల‌సి మొక్క‌కు ఉన్న ప్రాధాన్య‌త గురించి అంద‌రికీ తెలుసు. మ‌హిళ‌లు నిత్యం తుల‌సి మొక్క చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేసి అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటారు. చ‌నిపోతున్న వారి నోట్లో తుల‌సి తీర్థం పోసినా, తుల‌సి ఆకుల‌ను ఉంచినా వారి ఆత్మ నేరుగా వైకుంఠానికే పోతుంద‌ట‌. దీనికి తోడు తుల‌సి మొక్క వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలే ఉన్నాయి. తుల‌సి ఆకుల‌ను ప‌లు ఔష‌ధాల త‌యారీలోనూ వాడుతారు. అయితే మీకు తెలుసా..? తుల‌సి మొక్క హిందూ సాంప్ర‌దాయంలో అత్యంత పవిత్ర‌మైన మొక్క‌గా ఎందుకు మారిందో..? ఎందుకు ఆ మొక్క‌కు అన్ని ఔష‌ధ గుణాలు ఉన్నాయో..? అదే తెలుసుకుందాం రండి.

పురాత‌న కాలం నుంచి తుల‌సి మొక్కకు సంబంధించిన క‌థ ఒకటి ప్ర‌చారంలో ఉంది. అదేమిటంటే, విఘ్నేశ్వ‌రుడు ఒక‌సారి గంగాన‌ది ఒడ్డున కూర్చుని త‌ప‌స్సు చేస్తుంటాడు. అదే స‌మ‌యంలో తుల‌సి అనే ఓ మ‌హిళ అక్క‌డికి వ‌చ్చి గ‌ణేషున్ని చూసి ముగ్దురాల‌వుతుంది. వెంట‌నే గ‌ణేషుని వ‌ద్ద‌కు వెళ్లి త‌న‌ను పెళ్లి చేసుకోమ‌ని అడుగుతుంది. అయితే అందుకు వినాయ‌కుడు నిరాక‌రిస్తాడు. వివాహం చేసుకుంటే త‌న త‌పస్సుకు భంగం క‌లుగుతుంద‌ని అంటాడు. దీంతో తుల‌సికి కోపం వ‌చ్చి వినాయ‌కుడికి శాపం పెడుతుంది. అత‌ని వివాహం బ‌ల‌వంతంగా, ఇష్టం లేకుండా జ‌రుగుతుంద‌ని తుల‌సి అంటుంది. ఈ క్ర‌మంలో ఆగ్ర‌హానికి లోనైన వినాయ‌కుడు తుల‌సికి శాపం పెడ‌తాడు. ఒక రాక్ష‌సుడితో ఆమె వివాహం జ‌రుగుతుంద‌ని, అత‌ని వ‌ల్ల అన్నీ క‌ష్టాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని, వినాయ‌కుడు తుల‌సికి శాపం పెడ‌తాడు.

Lord Ganesha

అయితే వెంట‌నే తుల‌సి త‌న త‌ప్పు తెలుసుకుని శాప విమోచ‌నం చేయ‌మ‌ని గ‌ణేషున్ని ప్రార్థిస్తుంది. కాగా గ‌ణేషుడు అప్పుడు ఏమంటాడంటే, శాపం విమోచ‌నం చేయ‌లేన‌ని, కానీ వ‌చ్చే జ‌న్మ‌లో తుల‌సి మొక్క‌గా జ‌న్మిస్తావ‌ని, ఆ మొక్క లేకుండా విష్ణువుకు పూజ జ‌ర‌గ‌ద‌ని, అంతేకాకుండా దాంట్లో అనేక ఔష‌ధ గుణాలు కూడా క‌లిగి ఉంటాయ‌ని వినాయ‌కుడు తుల‌సికి వ‌రం ఇస్తాడు. అనంత‌రం తుల‌సి శంక‌చూద అనే ఓ రాక్ష‌సున్ని వివాహం చేసుకుంటుంది. కొద్ది రోజుల పాటు క‌ష్టాల‌ను అనుభ‌వించి ఆమె మ‌ర‌ణిస్తుంది.

మ‌ళ్లీ తుల‌సి మొక్క రూపంలో జ‌న్మిస్తుంది. అప్ప‌టి నుంచి తుల‌సి మొక్క ఆకుల‌ను విష్ణు పూజ‌కు ఉప‌యోగిస్తున్నారు. ఇప్పుడు కూడా తుల‌సి ఆకులు లేనిదే విష్ణు పూజ పూర్తి కాద‌ని చెబుతారు. అంతేకాదు తుల‌సి మొక్క‌లో ఉన్న ఔష‌ధ గుణాల గురించి కూడా ఇప్పుడు మ‌నంద‌రికీ తెలుసు. కాగా అంత‌టి ప‌విత్ర‌మైన తుల‌సిని వినాయ‌కుడి పూజ‌లో మాత్రం వాడ‌రు. ఎందుకంటే వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన ఆ సంఘ‌ట‌నే అందుకు కార‌ణ‌మ‌ని పండితులు చెబుతారు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM