Gold In Dream : సాధారణంగా మనకు రోజూ కలలు వస్తుంటాయి. కలల్లో ఎన్నో కనిపిస్తుంటాయి. కొందరికి చనిపోయిన తమ బంధువులు, కుటుంబ సభ్యులు, పెద్దలు కలలో వస్తుంటారు. కొందరికి పీడకలలు వస్తుంటాయి. కొందరు పాతాళంలో పడిపోయినట్లు కలలు కంటుంటారు. అయితే మనకు వచ్చే ప్రతి కలకు ఒక అర్థం ఉంటుందని స్వప్నశాస్త్రం చెబుతోంది. ఆ శాస్త్రం ప్రకారం మనకు వచ్చే కలలను బట్టి మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది ముందుగానే మనం తెలుసుకోవచ్చు. ఇక కలలో కొందరికి బంగారం, వెండి వంటి లోహాలు లేదా వాటితో తయారు చేసిన ఆభరణాలు, వస్తువులు కూడా కనిపిస్తుంటాయి. మరి అవి కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందామా.
కలలో వెండి కనిపిస్తే ఎంతో శుభం జరుగుతుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. ఈ శాస్త్రం ప్రకారం మీరు త్వరలోనే శుభవార్త వింటారు. అలాగే మీ ఇంట్లో సంతోషం నెలకొంటుంది. ఇక పెళ్లి కాని వారికి ఇలా కల వస్తే వెంటనే పెళ్లి అవుతుంది. అదే పెళ్లయిన వారికి ఇలా కల వస్తే వెంటనే సంతానం కలుగుతుంది.
కలలో బంగారం లేదా బంగారు ఆభరణాలు కనిపిస్తే అది శుభ శకునమని చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవానికి కలలో బంగారం కనిపించడం అంత శుభం కాదు. ఇది చాలా కీడు కలగజేస్తుందని అర్థం. స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి కల వస్తే మీకు త్వరలోనే భారీ ఎత్తున ఆర్థిక సమస్యలు రాబోతున్నాయని, మీరు త్వరలోనే అప్పుల్లో కూరుకుపోతారని అర్థం. కనుక బంగారం కలలో కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. డబ్బును పొదుపుగా వాడుకోవాలి.
మీకు కలలో ఇనుము లేదా ఇనుప వస్తువులు కనిపిస్తే అది ఎంతో శుభ శకునంగా భావించాలి. మీరు పడ్డ కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని తెలుసుకోవాలి. అలాగే మీకు ఉండే దీర్ఘకాలిక వ్యాధులు కూడా తొలగిపోతాయి. దీంతో మీకు పెద్ద రిలీఫ్ లభిస్తుంది. మీరు పనిచేసే చోట తగిన గుర్తింపు లభిస్తుంది. మీకు కలలో ఇత్తడి లేదా దాంతో తయారు చేసిన వస్తువులు కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం మీపై దేవుళ్లు, దేవతల ఆశీస్సులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అలాగే మీకు ఉండే కష్టాలు అన్నీ తొలగిపోతాయని, మీరు వృద్ధిలోకి వస్తారని అర్థం చేసుకోవాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…