కొత్త వాహనం కొనాలనుకునే వారికి మద్రాస్ హైకోర్టు షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. బంపర్ టూ బంపర్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వాహనాల ధరలు పెరగనున్నాయి. ఈ ఇన్సూరెన్స్ కారణంగా సెప్టెంబర్ 1 నుంచి వాహనాలపై అయిదేళ్ల భీమా తప్పనిసరి కానుంది. ఈ క్రమంలోనే వాహనాలపై 10 శాతం మేర ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు టూ వీలర్స్ పై సుమారుగా రూ.5 వేల నుంచి రూ.6 వేల ధర పెరగడమే కాకుండా, ఎంట్రీ లెవల్ కార్ల కొనుగోలుపై రూ.50,000, ఎస్యూవీ కార్ల పై రూ.2 లక్షల వరకు భారం పడుతుందని ఫాడా ప్రెసిడెంట్ వింకేశ్ గులాటి వెల్లడించారు. సాధారణంగా లక్ష రూపాయలు పెట్టి కొనుగోలు చేసేటప్పుడు ప్రీమియం భారం తగ్గించడానికి చాలా మంది ఎన్నో పథకాలు వేస్తారు. అలాంటి సమయంలో బంపర్ టూ బంపర్ ఇన్సూరెన్స్ చేయటం వల్ల కారు ప్రమాదానికి గురైనప్పుడు అందులో ఉన్న వ్యక్తులకు కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది.
కోర్టు తీర్పు కారణంగా ఒక వాహనంపై 3 శాతం మొత్తాన్ని ఐదేళ్లకు పెంచడంవల్ల మార్కెట్ వాల్యూ తగ్గుదల ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఇన్సూరెన్స్ ప్రీమియం దాదాపుగా 3 శాతం వరకు పెరుగుతుంది. ఈ క్రమంలోనే వాహన ధరలు కూడా పెరిగిపోతాయి. కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆటోమొబైల్ పరిశ్రమపై మద్రాస్ హైకోర్టు ఈ విధమైన తీర్పు ఇవ్వడంతో ఆ ప్రభావం అమ్మకాలపై పడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…