దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది బ్యాంకు ఖాతాదారుల అకౌంట్ల నుంచి రూ.330 డెబిట్ అవుతున్నాయి. వారికి ఆ మొత్తం డెబిట్ అయినట్లు మెసేజ్‌లు, మెయిల్స్ వస్తున్నాయి. అయితే బ్యాంకు ఖాతా నుంచి రూ.330 ఎందుకు డెబిట్ అవుతున్నాయో చాలా మందికి తెలియడం లేదు.
2015వ సంవత్సరం మే 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏడాదికి రూ.330 చెల్లిస్తే రూ.2 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఇన్సూర్ అయిన వ్యక్తి ఏవిధంగా అయినా సరే చనిపోతే అతని నామినీకి రూ.2 లక్షలు వస్తాయి. బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని ఆటో డెబిట్ చేసుకునే విధంగా సదుపాయం కల్పించారు. అందుకనే ఆ మొత్తం బ్యాంకు ఖాతాల నుంచి డెబిట్ అవుతోంది.
అయితే కొందరికి ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. అలాంటి వారికి ఒకటి కన్నా ఎక్కువ ఖాతాల్లో ఆ మొత్తం డెబిట్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వారితోపాటు ఈ పథకం వద్దనుకునేవారు తమ బ్యాంకు బ్రాంచిని సంప్రదించి ఈ పథకం నుంచి తొలగిపోతున్నట్లు లేఖ ఇవ్వాలి. దీంతో డెబిట్ అయిన ఆ మొత్తాన్ని బ్యాంకు వారు రీఫండ్ చేస్తారు.
ప్రతి ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య ఈ పథకానికి ప్రీమియం రూ.330 డెబిట్ అవుతాయి. అదే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో పథకంలో దరఖాస్తు చేసుకుంటే రూ.258, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలలో దరఖాస్తు చేస్తే రూ.170, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో దరఖాస్తు చేస్తే రూ.86 ప్రీమియం చెల్లించాలి. ఏడాది పూర్తి ప్రీమియం రూ.330 చెల్లించాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…