ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకవైపు కరోనా దాడి చేయడమే కాకుండా,మరో వైపు బ్లాక్ ఫంగస్ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ వైరస్ బారిన పడి చనిపోతున్నారు. ఇలాంటి సమయాలలో సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వాట్సప్ గ్రూపులలో చికెన్ తినడం వల్ల బ్లాక్ ఫంగస్ వ్యాపిస్తుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమందిని ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ విషయం తెలిసిన వారు చికెన్ తినడానికి ఇష్టపడటం లేదు. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి స్పందించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అపర్ణ ముఖర్జీ మాట్లాడుతూ… వాతావరణంలో ఉండే ఫంగస్ కోళ్లకు, మనుషులకు వ్యాపిస్తుందని, అయితే కోళ్ల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది అనడంలో ఏమాత్రం వాస్తవం లేదని సైంటిస్ట్ డాక్టర్ అపర్ణ తెలిపారు.
బ్లాక్ ఫంగస్ అనేది అంటువ్యాధి కాదని, అలాంటప్పుడు ఇది కోళ్ల నుంచి మనుషులకు ఎలా వ్యాపిస్తుందని ఆమె స్పష్టత ఇచ్చారు. ఇది కేవలం అసత్య ప్రచారాలు మాత్రమేనని ఇలాంటి ప్రచారాలు నమ్మి చికెన్ తినడానికి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ అపర్ణ ముఖర్జీ బ్లాక్ ఫంగస్ గురించి పూర్తి క్లారిటీ ఇచ్చారు. కాబట్టి చికెన్ నిరభ్యంతరంగా తినవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…