రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను తెలిపింది.ఈ క్రమంలోనే ఫ్లాట్ ఫామ్ ధరలను తగ్గిస్తూ తీసుకున్న కీలక నిర్ణయం ఎంతో మంది ప్రయాణికులకు ఊరట కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ వెసులుబాటు సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని ఉన్న అన్ని రైల్వే స్టేషన్లకు వర్తిస్తుంది.
గతంలో దక్షిణ మధ్య రైల్వే ఫ్లాట్ ఫామ్ టిక్కెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విధమైన నిర్ణయం తీసుకోవడంతో సామాన్య ప్రజలపై అధిక భారం పడిందని చెప్పవచ్చు. అయితే కేవలం covid 19 నేపథ్యంలో రైల్వే స్టేషన్ లో రద్దీని తగ్గించడం కోసమే రైల్వే అధికారులు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడటంతో ప్లాట్ ఫామ్ టిక్కెట్ ధరలను తగ్గించింది.
దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం ఇక పై సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్ లకు వర్తిస్తుందని ఈ సందర్భంగా రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో ఇకపై ప్లాట్ఫామ్ టికెట్ ధర కేవలం రూ.10 మాత్రమే ఉంటుంది. ఈ విధంగా ప్లాట్ ఫామ్ టికెట్ ధరలను తగ్గించడంతో సామాన్య ప్రజలకు భారీగా ఊరట కలుగుతుందని చెప్పవచ్చు.