మీరు మీ దగ్గర ఉన్న డబ్బులను రెట్టింపు చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక అద్భుతమైన పోస్టాఫీస్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఈ విధంగా పోస్టాఫీస్ ద్వారా డబ్బులను జమ చేయడం వల్ల మనకు ఎలాంటి రిస్క్ ఉండదు. ఈ విధంగా పోస్టాఫీస్ అందిస్తున్న స్కీమ్ లలో కిసాన్ వికాస్ పత్ర KVP కూడా ఒకటి. కేవీపీ స్కీమ్‌లో డబ్బులను పెడితే రెండింతల ఆదాయం పొందవచ్చు.
ఈ అద్భుతమైన పథకంలో చేరాలంటే కనీసం వెయ్యి రూపాయలు ఉండాలి. ఈ పథకానికి గరిష్ట పరిమితి అంటూ లేకుండా ఎంత మొత్తంలో అయినా మనం డబ్బులను ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ పథకం పై 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. 124 నెలల్లో డబ్బు రెట్టింపు అవుతుంది. ఈ ప్రకారం ఈ పథకం ద్వారా మనం ఐదు లక్షల రూపాయలను ఇన్వెస్ట్ చేస్తే మనం 10 లక్షల రూపాయలను పొందవచ్చు.
ఈ అద్భుతమైన స్కీమ్ లో చేరాలనుకునే వారు వెంటనే పోస్టాఫీస్ కి వెళ్లి ఈ పథకంలో చేరవచ్చు. ఇప్పటికే పోస్టాఫీసు ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. చిన్న మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వారికి ఈ పోస్టాఫీస్ పథకాలు అద్భుతమైన రాబడిని ఇస్తాయని చెప్పవచ్చు.