స‌మాచారం

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ హామీ ఉండడంతో ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఇందులో పోస్టాఫీసులో తమ డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం మంచి వడ్డీ రేట్లు కల్పిస్తోంది. కొంతమంది పిల్లల భవిష్యత్తు కోసం పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ అంటే పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెడతారు. పోస్టాఫీసులో 5 సంవత్సరాల ఎఫ్‌డీ బ్యాంకుల కంటే మెరుగైన వడ్డీ రేటును ఇస్తోంది. ఈ పథకలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.15 లక్షల రాబడి వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకం గురించి మరిన్ని వివరాలు చూద్దాం.

ఈ స్కీమ్‌లో భాగంగా ముందుగా 5 సంవత్సరాల పాటు పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ స్కీమ్ రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టాలి. పోస్టాఫీసు 5 సంవత్సరాల FDపై 7.5 శాతం వడ్డీని ఇస్తోంది. అంటే ఐదేళ్ల తర్వాత మెచ్యూరిటీ మొత్తం రూ.7,24,974 అవుతుంది. మీరు ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేయకుండా తర్వాత ఐదేళ్లకు కూడా పెట్టుబడి పెట్టాలి. ఇలా పదేళ్లల్లో 5 లక్షల మొత్తంపై వడ్డీ ద్వారా రూ. 5,51,175 సంపాదిస్తారు. అంటే మీ మొత్తం రూ. 10,51,175 అవుతుంది. అనంతరం 5 సంవత్సరాలకు చేయాలంటే రాబడిని రెండు భాగాలు విభజించి మళ్లీ డిపాజిట్ చేయాలి. ఇలా చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం 5 లక్షలపై వడ్డీ నుండి మాత్రమే రూ.10,24,149 పొందవచ్చు. ఈ విధంగా మీరు పెట్టుబడి పెట్టిన 5 లక్షలు, 10,24,149 రూపాయలను కలపడం ద్వారా మీరు మొత్తం 15,24,149 రూపాయలు పొందవచ్చు.

అయితే పోస్టాఫీసు టైమ్ డిపాజిట్‌ను రెండుసార్లు మాత్రమే పొడిగించే అవకాశం ఉంటుంది.ప్రస్తుతం పోస్టాఫీసులో ఏడాది టర్మ్ డిపాజిట్ స్కీమ్ 6.9 శాతం వడ్డీ రేట్లు ఉన్నాయి. అలాగే రెండేళ్ల టైమ్ డిపాజిట్ స్కీమ్‌పై 7 శాతం, మూడు సంవత్సరాల ఎఫ్‌డీపై 7.1 శాతం, ఐదేళ్ల డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ అందిస్తోంది. అయితే, మీరు ఎంచుకున్న స్కీమ్ పొడిగించుకోవాలనుకున్నప్పుడు ఈ విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఏడాది డిపాజిట్ అయితే మెచ్యూరిటీకి 6 నెలల ముందే పొడిగింపు అభ్యర్థన చేసుకోవాలి. అలాగే రెండేళ్ల టెన్యూర్ అయితే ఏడాదిలోపే.. 3,5 ఏళ్లలోపు ఎఫ్‌డీ పై పొడిగింపునకు 18 నెలల లోపే పోస్టాఫీసుకు తెలియ జేయాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసే సమయంలోనూ టెన్యూర్ పొడిగింపుపై తెలియ జేసే అవకాశం ఉంటుంది.

Share
Sunny

Recent Posts

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన…

Monday, 16 September 2024, 6:55 AM

Viral Video : ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని రైలు ప‌ట్టాల‌పై నిద్ర పోయిన యువ‌తి.. త‌రువాత ఏమైందంటే..?

Viral Video : ఇటీవ‌లి కాలంలో యువ‌త చిన్న చిన్న కార‌ణాల‌కి ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు. కాస్త మ‌నస్థాపం చెంద‌డంతో ఆత్మ‌హ‌త్యే…

Saturday, 14 September 2024, 5:08 PM

Venu Swamy : వేణు స్వామికి భారీ షాకే త‌గిలిందిగా.. ఏమైందంటే..?

Venu Swamy : సెలెబ్రిటీల జ్యోతిష్యుడిగా ఫేమస్ అయిన వేణు స్వామి ప‌లువురి జతకాలు చెప్తూ.. వివాదాస్పద జ్యోతిష్యుడిగా పేరు…

Saturday, 14 September 2024, 5:05 PM