దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో పెట్రోల్ మరియు డీజిల్ వంటి ఇంధనాలకు డిమాండ్ ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో అనేక కొత్త పెట్రోల్ బంకులు నెలకొల్పబడుతున్నాయి. అంతే కాదు ఈ పెట్రోల్ బంకుల్లో చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి.తక్కువ పెట్రోల్ కొట్టి ఎక్కువ డబ్బులు తీసుకోవడం, కల్తీ పెట్రోల్ విక్రయించడం వంటి వాటితో వినియోగదారుల నుంచి డబ్బులు దొచేస్తున్నారు! కస్టమర్లను మోసం చేయడానికి పెట్రోల్ బంక్ సిబ్బంది ఇలాంటి అనేక కిటుకులను ప్రదర్శిస్తున్నారు. ఈ విధంగా పెట్రోల్ బంకుల్లో మోసపోకుండా ఉండటానికి ఈ కొన్ని నియమాలను పాటిస్తే తప్పకుండా మోసపోయే అవకాశం ఉండదు.
పెట్రోల్ బంక్ వాళ్లు చేసే మోసాల్లో షార్ట్ ఫ్యూయలింగ్ ప్రధానమైనది. దీనిని సింపుల్‌గా చెప్పాలంటే, తక్కువ ఇంధనం నింపి, ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంటారు. వాహనదారులు కారులోంచి కిందకు దిగరు. అదే మీరు చేస్తున్న పెద్ద తప్పు అని మర్చిపోకండి. చాలా పెట్రోల్ బంకుల్లో వాహనదారులు కిందకు దిగకపోవడం వల్లే ట్యాంక్ ఫుల్ చేస్తామనే పేరుతో వెహికల్ ఓనర్‌ని ఫూల్స్‌ని చేస్తున్నారు. పెట్రోల్ బంకు వాళ్లు ఫ్యూయెల్ డెన్సిటీ (ఇంధన సాంద్రత)లో కూడా మార్పులు చేస్తుంటారు. ఈ మోసాన్ని నివారించాలంటే, మీటర్లో ఇంధన సాంద్రతను చెక్ చేయాలి. కొన్నిసార్లు మీటర్‌ను కూడా వాళ్లు మానిప్యులేట్ చేస్తుంటారు. పెట్రోల్ ఫ్లో చాలా వేగంగా ఉంటే, దాని డెన్సిటీలో మార్పులు చేసి మిమ్మల్ని మోసం చేస్తున్నారని గుర్తించాలి.
కారు లేదా బైక్‌లో పెట్రోల్ లేదా డీజిల్ నింపుకునేటప్పుడు ముఖ్యంగా వాహనదారుడు వాహనం దిగి ఆయిల్ నింపే దగ్గర మీటర్ రీడింగ్‌ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఏమైనా మోసం చేశారని తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి. సాధారణంగా పెట్రోల్ బంకుల్లో ఎలాంటి స్కామ్‌లు జరుగుతుంటాయో తెలుకోవాలి. వాటి నుంచి ఎలా బయట పడాలో కూడా అవగాహన పెంపొందించుకోవాలి. ఇలా చేయడం వల్ల బంకుల్లో చేసే స్కామ్‌లను సులభంగా నివారించవచ్చు. ప్రతి ఆయిల్ కంపెనీ, ప్రతి పెట్రోల్ బంక్‌లోనూ ఒక కంప్లైంట్ రిజిస్టర్ బుక్‌ను అందుబాటులో ఉంచుతుంది. ఒకవేళ అలా కుదరకపోతే, ఆయిల్ కంపెనీ వెబ్సైట్లోనూ సదరు పెట్రోల్ బంక్‌పై ఫిర్యాదు చేయవచ్చు.మంచి పేరున్న ఇంధన స్టేషన్లో ఆయిల్ నింపుకోవడం ఉత్తమం. ఎప్పుడూ అలా చేయడం సురక్షితమైన ఆలోచన కూడా. వాహనదారులను మరియు ఇన్స్పెక్టర్లను మోసం చేయడానికి కొన్నిసార్లు మీటర్లు కూడా వక్రీకరించబడతాయి. కావున ఇటువంటి వాటిలో ఎక్కువ మోసం జరిగే అవకాశం ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…