వినోదం

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా భారీ బ‌డ్జెట్‌తో రూపొందింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ముఖ్యంగా ఇటీవల రిలీజైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దేవర టీం మాత్రం ప్రమోషన్స్ జోరు పెంచేస్తోంది. అటు సందీప్ రెడ్డి వంగాతో ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. దాని ప్రోమో నెట్టింట్లో బాగానే వైరల్ అవుతోంది. ఇటు కుర్ర హీరోలైన విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డతో దేవర ఇంటర్వ్యూ జరిగింది.

అటూ ఇటూ అంటూ ఎన్టీఆర్ అయితే ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్‌తో పాటుగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో కొరటాల కూడా ఫుల్ బిజీగా తిరుగుతున్నాడు. ఇక దేవర టికెట్స్ రేట్స్ ను పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను మేకర్స్ కోరారు. ఇందుకు ఇరు ప్రభుత్వాలు కూడా అనుమతులు ఇచ్చాయని తెలుస్తోంది.దీంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెరిగిన టికెట్ల రేట్లు ఇలా ఉన్నాయి.. నైజాం ఏరియాలో ఉన్న మల్టీప్లెక్స్ ల్లో రూ. 413, అలాగే సింగిల్ స్క్రీన్లలో రూ. 250 పెరిగాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 325, సింగిల్ స్క్రీన్లలో రూ. 200 పెంచుకునేందుకు అనుమతులు వచ్చాయని సమాచారం. మెుదటి వారం లేదా పది రోజుల వరకు పెంచిన ఈ టికెట్ల రేట్లే కంటిన్యూ అవ్వనున్నాయి.

Devara Ticket Prices

భారీ బ‌డ్జెట్ సినిమా కావ‌డంతో ఇప్పుడున్న టిక్కెట్ రేట్లు పెంచుకుంటే త‌ప్పా భారీగా రిక‌వ‌రీ ఉండ‌దు. సినిమాకు ఎంత హిట్ టాక్ ఉన్నా సినిమాకు జ‌రిగిన ప్రి రిలీజ్ బిజినెస్ నేప‌థ్యంలో అన్ని ఏరియాల్లోనూ టార్గెట్లు భారీగా ఉన్నాయి. ఏపీలో సీడెడ్ కాకుండానే మిగిలిన ఏరియాల‌కు రు. 55 కోట్ల‌కు అమ్మిన‌ట్టుగా తెలుస్తోంది. నైజాంలోనూ దేవ‌ర టార్గెట్ రు. 50 కోట్ల రేంజ్‌లో ఉందంటున్నారు. ఈ మేర షేర్ రాబ‌ట్టాలి అంటే.. గ్రాస్ ఇంచా చాలా ఎక్కువుగా ఉండాలి.నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ ద్వారానే ఏకంగా 1 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌ట్టేసింది.కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో జాన్వీక‌పూర్ హీరోయిన్‌. సైఫ్ ఆలీఖాన్‌, బాబీడియోల్ విల‌న్లు కాగా.. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్నారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM