వినోదం

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన సినిమాలు నేడు పాన్ ఇండియా రెంజ్ లో విడుదలవుతున్నాయంటే.. అది ఆయన ఫ్యాన్స్ వల్లే.. అందుకే ఆయన తన ఫ్యాన్స్ కోసం ఏదైనా చేయడానికి వెనకాడాడు. తనని ప్రేమించే అభిమానులకు అండగా నిలుస్తారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తాజాగా క్యాన్సర్‌తో పోరాడుతున్న తన అభిమానికి తాజాగా వీడియో కాల్‌ చేసి ధైర్యం చెప్పారు. ఆ స‌మ‌యంలో అభిమాని ముఖంలో కనిపించిన ఆనందం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ చేసిన ప‌నిపై స‌ర్వత్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది.

ప్రాణాంతక క్యాన్సర్ తో బాధపడుతున్నఎన్టీఆర్ వీరాభిమాని పేరు కౌశిక్. కౌశిక్ వయసు 19 ఏళ్లే. కానీ విధి అతడి జీవితాన్ని తారుమారు చేసింది. కొంత కాలంగా అతడు బోన్ క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. ఇటీవల ఆ కుర్రాడి తల్లిదండ్రులు తిరుపతిలో మీడియా ముందుకు వచ్చి, తమ కుమారుడి చివరి కోరిక ఏంటో చెప్పారు. చనిపోయేలాగా ఎన్టీఆర్ దేవర సినిమా చూడాలన్నదే తమ కుమారుడి ఆఖరి కోరిక అని, దేవర సినిమా చూసేంతవరకైనా తనను బతికించాలని తమ కుమారుడు డాక్టర్లను వేడుకుంటున్నాడని చెప్పి ఆ తల్లిదండ్రులు భోరున విలపించారు. కాగా, తన అభిమాని పరిస్థితి తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ వెంటనే స్పందించారు.

తాజాగా కౌశిక్ కు వీడియో కాల్ చేసి అతడిని సంతోషసాగరంలో ముంచెత్తారు. నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి… నవ్వుతుంటే చక్కగా ఉన్నావు అని ఎన్టీఆర్ తన అభిమాని కౌశిక్ లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నించారు. మీతో మాట్లాడతానని అసలు అనుకోలేదు అని కౌశిక్ చెప్పగా… భలేవాడివే, అభిమానులతో మాట్లాడకుండా ఎలా ఉంటాను? అని ఎన్టీఆర్ బదులిచ్చారు. ఎలా ఉన్నావంటూ కౌశిక్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్టీఆర్ అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్ ను జయించి రావాలని పేర్కొన్నారు. సినిమా సంగతి తర్వాత… ముందు నీ ఆరోగ్యం బాగుపడాలి… మీ అమ్మానాన్నలను చూసుకోవాలి అని ఆకాంక్షించారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM