Viral Video : ఇటీవలి కాలంలో యువత చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాస్త మనస్థాపం చెందడంతో ఆత్మహత్యే శరణ్యం అని భావిస్తున్నారు. ఎగ్జామ్ పాస్ కాలేదని, ప్రేమించిన అమ్మాయితొ పెళ్లికాలేదని ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇంట్లో గొడవలు జరిగాయని, నాన్న తిట్టాడని, అన్నయ్య కొట్టాడని సూసైడ్ లు చేసుకుంటారు. కడుపునొస్తుందని, పెళ్లి ఆలస్యమౌతుందని కూడా ఇటీవల కాలంలో కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆసమయంలో కోపం వల్ల.. కఠినమైన డిసిషన్స్ తీసుకుని, తమ జీవితాల్ని మధ్యలోనే ముగించేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎక్కువగా మంది రైల్వే పట్టాల మీద వెళ్లి సూసైడ్ చేసుకుంటున్నారు.
తాజాగా రైలుకింద పడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది ఓ బాలిక. ఆమె ట్రాక్ మధ్యలో కూర్చుంది. ట్రైన్ ఎంతకీ రాకపోవడంతో అలాగే నిద్రపోయింది. చివరికి ఓ రైలు రాగా, అందులోని లోకోపైలట్ గమనించడంతో ఆమె ఆత్మహత్య యత్నం విఫలమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బీహార్‌లోని చకియా రైల్వే స్టేషన్‌లో జరిగిందీ ఘటన. పట్టాల మధ్య అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో అప్రమత్తమైన లోకోపైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు సరిగ్గా ఆమె తల వద్దకు వచ్చి ఆగింది. ఆపై కిందికి దిగిన పైలట్ పట్టాల మధ్య నిద్రపోతున్న అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమెను తట్టిలేపాడు. ఏం జరుగుతోందో అర్థం కాని ఆమె ఏడుపు మొదలుపెట్టింది.
ఆపై అక్కడే ఉన్న మహిళలతో ఆమెను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. తాను రానని ఆమె మొండికేసింది. దీంతో వారు ఆత్మహత్య చేసుకోవాలన్నంత బాధ నీకేమొచ్చిందని అడగడం వినిపించింది.ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పిల్లలతో నిత్యం మాట్లాడుతుండాలని ఒకరంటే.. ఏ విషయంలోనైనా పిల్లలపై ఎప్పుడూ ఒత్తిడి తీసుకురాకూడదని ఇంకొకరు కామెంట్ చేశారు.అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ యువతిని అదుపులోకి తీసుకుని ఇంటికి చేర్చారు. ఈ ఘటనతో రైలు దాదాపుగా 45నిమిషాలు లేటుగా బయలుదేరింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…