మీరు పీఎఫ్ ఖాతాదారులా..? మీకు పీఎఫ్ ఖాతా ఉందా.? అయితే మీకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ ఖాతాదారులకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి కాను వచ్చే వడ్డీ డబ్బులను EPFO కస్టమర్లకు ఖాతాలో జమ చేయనున్నట్లు తెలియజేసింది. ఈ క్రమంలోనే ఖాతాదారులకు శుభవార్తని తెలుపుతూ EPFO వచ్చే దీపావళి పండుగలో ఖాతాదారుల వడ్డీ డబ్బులను వారి ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడించింది.
ఈ క్రమంలోనే EPFO సెంట్రల్ బోర్డ్ వడ్డీరేట్లకు కూడా ఆమోదముద్ర తెలియజేయడంతో కేవలం ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభిస్తే వెంటనే వడ్డీ డబ్బులు ఖాతాదారుల అకౌంట్లో జమ కానున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం 2020 – 21 సంవత్సరానికి గాను పీఎఫ్ వడ్డీరేటును 8.5 శాతానికి తగ్గించింది.
తగ్గిన వడ్డీ రేట్లకు అనుగుణంగానే డబ్బులు ఖాతాదారుల అకౌంట్లో జమ కానున్నాయి. అయితే ఈ వడ్డీ రేట్లు 2018 – 19 వ సంవత్సరంలో 8.65 శాతం ఉండగా 2017 -18 లో 8.55 శాతం ఉంది. ఇకపోతే 2016 – 17 వడ్డీ రేట్లు 8.65 శాతం ఉండటం గమనార్హం. ఏది ఏమైనప్పటికీ 2020 -21 సంవత్సరానికి గాను రావాల్సిన వడ్డీ డబ్బులు త్వరలోనే లబ్ధిదారులకు అందనున్నాయని తెలియడంతో ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…