సాధారణంగా జంతు ప్రేమికులు ఏ కుక్కనో, పిల్లినో పెంచుకోవడం చూస్తుంటాము. సరదాగా మనం బయటకు వెళ్లినప్పుడు వాటిని వెంట తీసుకొని వెళ్తారు. లేదంటే కొందరు వాకింగ్ వెళ్ళినప్పుడు వాటికి తాడు కట్టి సరదాగా వాకింగ్ కు తీసుకు వెళ్లడం చూస్తుంటాము. ఈ క్రమంలోనే కుక్కలకు, పిల్లులకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తూ వాటిని వారి అనుసరనలో పెట్టుకుంటారు. ఈ విధంగా కుక్కలు, పిల్లులను పెంచుకోవడం మనం చూస్తున్నాము. కానీ మీరు ఎప్పుడైనా తొండను పెంచుకోవడం చూశారా ? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
అమెరికాలోని ఫ్లోరిడాకి చెందిన ఓ వ్యక్తి భిన్నంగా తొండను పెంచుకుంటున్నాడు. కుక్కల మాదిరిగా తొండ మెడకు దారం కట్టి దానిని తనతో పాటు పార్కుకి తీసుకెళ్తున్నాడు. ఆ తొండ కూడా అతను చెప్పిన విధంగానే చేస్తోంది. ఆ తొండకు ఆకలి వేసినప్పుడు నోరు తెరవగా ఆ వ్యక్తి దానికి ఆహారం పెడుతున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు దానికి స్వేచ్ఛ కల్పించండి అంటూ కామెంట్లు చేయగా మరికొందరు అది తొండా.. లేక జురాసిక్ పార్క్ సినిమాలోని పిల్ల డైనోసారా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ విధమైనటువంటి వాటిని క్లామిడోసారస్ అని పిలుస్తారు. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి. ఇవి ఎవరికీ హాని తలపెట్టవు. ఎక్కువగా ఇలాంటి తొండలు చెట్లపై నివసిస్తూ ఉంటాయి. ఇవి తోకతో కలిపి మొత్తం 85 సెంటీ మీటర్ల పొడవు ఉంటాయి. ప్రస్తుతం ఈ తొండకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…