ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ కోటక్ మహీంద్రా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మార్చింది. ఈ క్రమంలో మార్చిన ప్రకారం వడ్డీ రేట్లను అందివ్వనుంది. 7 నుంచి 30 రోజుల వ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లకు, 31 నుంచి 90 రోజులు, 91 నుంచి 179 రోజుల వ్యవధి కలిగిన ఎఫ్డీలకు బ్యాంకు వరుసగా 2.5, 2.75, 3.25 శాతం వడ్డీ రేట్లను చెల్లించనుంది. అలాగే 180 రోజుల నుంచి 1 ఏడాది వ్యవధి గల టర్మ్ డిపాజిట్లపై 4.40 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అలాగే 1 ఏడాది నుంచి 389 రోజుల వ్యవధి వరకు అయితే 4.50 శాతం వడ్డీని చెల్లిస్తుంది.
390 రోజుల నుంచి 23 నెలల కాలానికి ఎఫ్డీలకు 4.90 శాతం, 23 నెలల నుంచి 3 ఏళ్ల కాలానికి 5 శాతం వడ్డీని బ్యాంక్ చెల్లిస్తుంది. 3 ఏళ్లు ఆపైన, 4 ఏళ్ల లోపు కాలానికి ఎఫ్డీలకు 5.10 శాతం, 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపు ఎఫ్డీలు అయితే 5.25 శాతం వడ్డీని అందిస్తోంది. 5 ఏళ్ల పైన 10 ఏళ్ల లోపు అయితే 5.30 శాతం వడ్డీ వస్తుంది. సవరించిన ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్చి 25, 2021వ తేదీ నుంచి అమలు చేస్తోంది.
కోటక్ మహీంద్రా బ్యాంకు అందిస్తున్న సవరించిన ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
- 7 నుంచి 14 రోజుల వరకు 2.50 శాతం
- 15 నుంచి 30 రోజుల వరకు 2.50 శాతం
- 31 నుంచి 45 రోజుల వరకు 2.75 శాతం
- 46 నుంచి 90 రోజుల వరకు 2.75 శాతం
- 91 నుంచి 120 రోజుల వరకు 3.25 శాతం
- 121 నుంచి 179 రోజుల వరకు 3.25 శాతం
- 180 రోజుల వరకు 4.40 శాతం
- 181 రోజుల నుంచి 269 రోజుల వరకు 4.40 శాతం
- 270 రోజుల వరకు 4.40 శాతం
- 271 రోజుల నుంచి 363 రోజుల వరకు 4.40 శాతం
- 364 రోజుల వరకు 4.40 శాతం
- 365 రోజుల నుంచి 389 రోజుల వరకు 4.50 శాతం
- 390 రోజుల వరకు 4.90 శాతం
- 391 రోజుల నుంచి 23 నెలల లోపు – 4.90 శాతం
- 23 నెలలకు – 5 శాతం
- 23 నెలల 1 రోజు నుంచి 2 ఏళ్ల లోపు – 5 శాతం
- 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల లోపు – 5 శాతం
- 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల లోపు – 5.10 శాతం
- 4 నుంచి 5 ఏళ్ల లోపు – 5.25 శాతం
- 5 నుంచి 10 ఏళ్ల వరకు – 5.30 శాతం
ఇక సీనియర్ సిటిజెన్స్కు సాధారణ ప్రజలకు అందించే వడ్డీ రేట్ల కన్నా 50 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్లు ఎక్కువగా లభిస్తాయి. వారు కనీసం 7 రోజుల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లను వేయవచ్చు. 3 నుంచి 5.8 శాతం వరకు వడ్డీ చెల్లిస్తారు.